లేటెస్ట్

'శివాజీ' ఎక్కడ...!?

టివి9 వివాదం బయటకు వచ్చాక...హీరో 'శివాజీ' అందులో పోషించిన పాత్ర గురించి...ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ మధ్య టివి9 అమ్మకం గురించి..చర్చ జరుగుతున్నప్పుడు తనకు అందులో భాగముందని, తనకు చెప్పకుండా ఎలా అమ్ముతారని..'శివాజీ' ప్రశ్నించినట్లు ప్రచారం జరిగింది. తరువాత..వివాదం ముదరడం...నూతన కొనుగోలుదారులు 'టివి9' నుంచి 'రవిప్రకాష్‌'ను తొలగించడం, ఆపై ఆయనపై పోర్జరీ, ఛీటింగ్‌ కేసులు నమోదు చేశారు. ఆయనతో నటుడు 'శివాజీ' కూడా దీనిలో సహనిందితుడని పోలీసులు కేసులు నమోదు చేశారు. తనపై కేసులు నమోదు అయిన దగ్గర నుంచి 'శివాజీ' అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నారు..? ఏమి చేస్తున్నారు..? టివి9లో వాటాలు ఉన్నాయని చెప్పిన..ఆయన వివాదం ఇంత వరకు వచ్చిన తరువాత కూడా ఎందుకు నోరు విప్పడం లేదు...? రవిప్రకాష్‌తో కలసి ఆయన ఫోర్జరీ చేశారనేది నిజమేనా..? ఎందుకు ఆయన పరారీలో ఉన్నారనే ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. మొన్నటి దాకా..ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కుట్రలు చేస్తుందని గరుఢపురాణం..అంటూ.. చెప్పిన 'శివాజీ' తాజాగా టివి9 వివాదంలో చిక్కుకున్నారు. రవిప్రకాష్‌కు స్నేహితుడైన 'శివాజీ' తాజా పరిస్థితుల్లో పరారయ్యారని, ఆయనను త్వరలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి తన గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించకుండా..ఎవరికి అందుబాటులోకి రాకుండా పోయిన 'శివాజీ' దీనిపై త్వరలో మీడియా ముందుకు వస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

(570)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ