WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రేప్‌'పై 'మీరాజాస్మిన్‌' సంచలన వ్యాఖ్యలు..!

మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మగవారి అంగాలను కట్‌ చేయాలని ప్రముఖ సినీనటి 'మీరాజాస్మిన్‌' డిమాండ్‌ చేశారు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన 'మీరా జాస్మిన్‌' ఇటీవల తమిళనాడులోని 'పెరంబదూర్‌'లో అత్యాచారానికి గురైన దళిత బాలికను ఆమెను పరామర్శించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ అత్యాచారానికి గురైనప్పుడు పడే బాధ అత్యాచారం చేసేవాడూ పడాలని...రేప్‌ చేసిన వాడికి అంగాన్ని కట్‌ చేయాలని...అప్పుడే మహిళలను తాకాలంటే ఇటువంటి రేపిస్టులు భయపడతారని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయంగా కొన్ని దేశాల్లో ఇదే శిక్ష విదిస్తున్నారని మన దేశంలోనూ ఇటువంటి శిక్షే అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. మహిళల మనోభావాలకు విరుద్ధంగా పశుబలంతో మహిళపై అత్యాచారాలకు దిగుతున్న ఇటువంటి వారికి ఇదే తగిన శిక్ష అని ఆమె అన్నారు. మొత్తం మీద సినిమా హీరోయిన్‌కు సామాజిక స్పృహ ఉండడం అభినందనీయమే...కీపిటప్‌ 'మీరా'...!


(657)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ