లేటెస్ట్

'కెసిఆర్‌'కు 'జగన్‌' సహాయం...!

అవునండి...మీరు చదివింది..నిజమే...! తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సహాయం చేశారట. ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిపక్షనేతగా..ఉన్న 'జగన్‌'..'కెసిఆర్‌'కు సహాయం చేయడం..ఏమిటి..? ఆయన స్థాయి ఏమిటి..? కెసిఆర్‌ స్థాయి ఏమిటి..? తెలంగాణతో పాటు...జాతీయస్థాయిలో పేరు సంపాదించిన 'కెసిఆర్‌'కు 'జగన్‌' సహాయం చేసే స్థితిలో ఉన్నారా...? మొన్ననే కదా..ఎన్నికల సమయంలో...'కెసిఆర్‌' 'జగన్‌'కు ఆర్థికంగా, రాజకీయంగా సహాయం చేసినట్లు వివిధ మీడియాల్లో చదివాం..కదా...? మరి..అటువంటి పరిస్థితుల్లో ఉన్న 'కెసిఆర్‌'కు 'జగన్‌' చేసిన సహాయం ఏమిటంటారా..? ఆయన వల్ల 'కెసిఆర్‌' ఏ విధంగా సహాయం పొందారని అంటారా..? చెబుతాం...!

మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తమిళనాడు ప్రతిపక్షనేత, డిఎంకె అధ్యక్షుడు 'స్టాలిన్‌'ను కలవాలని అపాయింట్‌మెంట్‌ అడిగితే...'ఖాళీ' లేదు..కలవడానికి వీలు లేదని..చెప్పారని...మీడియాలో ప్రముఖంగా వచ్చింది..కదా..? దాంతో...చెన్నె పర్యటనకు వెళదామనుకున్న 'కెసిఆర్‌' వీలు కాక..హైదరాబాద్‌ వచ్చారు...కదా.. తాజాగా ఈ రోజు 'చెన్నె'లో 'స్టాలిన్‌'ను కలిశారు కదా...? రెండు రోజుల కిందట...కలవడానికి వీలు లేదన్న 'స్టాలిన్‌' ఇప్పుడు ఎందుకు కలిశారు..అంటే 'జగన్‌' వల్లేనని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. 'స్టాలిన్‌' ముందుగా 'కెసిఆర్‌'ను కలవడానికి ఇష్టపడలేదని, 'జగన్‌' జోక్యం చేసుకుని...ఒక ప్లాన్‌ చెప్పారని, దానికి..స్టాలిన్‌ ఓకే అని.. 'కెసిఆర్‌'ను వెంటనే రమ్మన్నారని ఆ సంస్థలు చెబుతున్నాయి. దక్షిణాదిలో 'కెసిఆర్‌, స్టాలిన్‌, నవీన్‌పట్నాయక్‌, తనకు కలిపి కనీసం వంద పార్లమెంట్‌ సీట్లు వస్తాయని, ఈ వంద సీట్లతో కాంగ్రెస్‌, బిజెపితో బేరం పెడితే...మన పనులు చేసుకోవచ్చని..'జగన్‌' స్టాలిన్‌కు చెప్పారట. మన పనులు చేసుకోవచ్చని 'జగన్‌' సలహా  నచ్చడంతో...'కెసిఆర్‌'ను కలసి 'జగన్‌' ప్లాన్‌పై చర్చించారని 'జగన్‌'కు వీర తాడు వేస్తున్నాయి...ఆ మీడియా సంస్థలు...జాతీయ రాజకీయాల్లో ఎక్కడా 'జగన్‌' జోక్యం చేసుకున్నట్లు కనపడకపోయినా...ఆయన ఇంట్లో కూర్చుని...వీడియో గేమ్స్‌ ఆడుతూ...జాతీయ రాజకీయాల్లో చక్రం గిరిగిరా తిప్పుతున్నారట. మొత్తం మీద...'జగన్‌', కెసిఆర్‌ ఉమ్మడి బేరాలు...స్టాలిన్‌లో ఉత్సాహాన్ని ఇచ్చాయట...? ఎంతైనా...'జగన్‌' ఉత్తమ వ్యాపారి కదా...? ఆయన తండ్రి జీవించి ఉన్నప్పుడు....'జగన్‌' చేసిన వ్యాపారాలు..ఎంత ఇదిగా లాభాలాను పంచాయో..? మరి అటువంటి వ్యాపారి..మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు..మరి..! 

(701)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ