WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కుప్పకూలిన విమానం...ప్రయాణీకుల్లో బ్రెజిల్‌ పుట్‌బాల్‌ జట్టు...!

బ్రెజిల్‌కు చెందిన ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ విమానంలో ఆ దేశానికి చెందిన ఫుట్‌ బాల్‌ క్రీడాకారులను తీసుకెళుతున్న విమానం కుప్పకూలిపోయింది. మొత్తం 81మందితో వెళుతున్న సీపీ 2933 అనే ఈ చార్టెడ్‌ విమానం కొలంబియా నగరం వెలుపల ఉన్న పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. ఈ 81 మందిలోనే బ్రెజిల్‌ లోని చాపెకోఎన్సో ఫుట్‌ బాల్‌ అసోసియేషన్‌ అనే ఓ క్లబ్బుకు చెందిన ఫుట్‌ బాల్‌ క్రీడాకారులు ఉన్నారు. ఈ విమానం కొలంబియాలోని మెడిలిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది.బొలివియా నుంచి బయలు దేరిన ఈ విమానం కొలంబియా చేరుకునే సమయంలోనే రాడార్‌నుంచి నుంచి తప్పిపోయిందని, ఆ తర్వాతే అది నగరం శివారు ప్రాంతాల్లోని పెద్ద పర్వాతాల్లో కూలిపోయినట్లు గుర్తించినట్లు మెడిలిన్‌ ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది ట్విట్టర్‌ ద్వారా చెప్పారు. కొలంబియాలో జరుగుతున్న కోపా సుడామెరికా ఫైనల్స్‌లో పాల్గొనేందుకు వీరంతా బయలు దేరినట్లు తెలిసింది. ఎంతమంది చనిపోయి ఉంటారనే విషయంపై స్పష్టత లేదు.  బ్రెజిల్‌ కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి తరువాత ఈ విమానం కూలిపోయింది. ఇంధనం లేక విమానం ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.


(487)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ