WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అవినీతి అధికారులకు...సింహస్వప్నం...ఆ ఐఎఎస్‌...!

ఆయన నిజాయితీ పరుడైన ఐఎఎస్‌ అధికారి. అవినీతిని దరి చేరనివ్వడు..! ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తారు..అందుకే ఆ అధికారికి అంటే సిఎంకు అత్యంత అభిమానం. జిల్లా స్థాయిలో తనతో పాటు ఇతర అధికారులను నిజాయితీగా బాధ్యతలను నిర్వహింపచేస్తున్నాడు. అవినీతి అధికారులకు, ఉద్యోగులకు ఆయన సింహస్వప్నం. ఇక్కడ అధికార అవినీతి కన్నా రాజకీయ అవినీతి ఎక్కువ. అధికారులు అవినీతికి పాల్పడితే...చీల్చిచెండాడతాడా అధికారి. ఏదో విధంగా ఆయనను బదిలీ చేసేందుకు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యారు రాజకీయనాయకులు. మానవ ప్రయత్నం విఫలం కావడంతో ఆ అధికారిని బదిలీ చేస్తే..వంద గొర్రెలను బలి ఇస్తామని అమ్మవారికి మొక్కుకుంటున్నారడ ఉద్యోగులు...! ఈ సంఘటన ఎక్కడో జరిగలేదు. పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ సమావేశంలో ఒక ఎమ్మెల్యే స్వయంగా ఈ మాటలు చెప్పాడంటే పరిస్థితి ఏమిటో తెలియవస్తుంది. 

   జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'కాటంనేని భాస్కర్‌'కు నిజాయితీపరుడిగా అన్ని వర్గాల్లో పేరుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉద్యోగుల అవినీతిని చాలా వరకు ఆయన కంట్రోల్‌ చేయగలిగారు. ఆయనతోపాటు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌తోపాటు, జిల్లా స్థాయి అధికారులలో ఎక్కువ మంది నిజాయితీపరులే. గతంలో అవినీతికి పాల్పడిన అధికారులను ప్రభుత్వానికి సరెండర్‌ చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో అవినీతి రుచిమరిగిన అధికారులు ఇక్కడకు రావాలంటే భయపడుతున్నారు. 

    ఈ జిల్లాకు వస్తే కేవలం జీతం సొమ్ముతోనే బతకాలనే బాధతో వారు అవ్యవహరిస్తున్నారు. తమ అదనపు ఆదాయానికి కలెక్టర్‌ గండికొడుతున్నారని, ఆయనకు తోడుగా జాయింట్‌ కలెక్టర్‌ కూడా ఉన్నారని...ఈ నేపథ్యంలో వారిని జిల్లా నుండి బదిలీ చేస్తే వందే కాదు..రెట్టింపు గొర్రెలను బలి ఇస్తామని చాలా మంది ఉద్యోగులు మొక్కుకుంటున్నారట. ముఖ్యంగా అధికారపార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రి కూడా కలెక్టర్‌ను బదిలీ చేయించాలని విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా అధికారపార్టీకి కంచుకోట. ఆ కంచుకోటను అధికారపార్టీ  నాయకులు తమ అవినీతితో బద్దలు కొట్టారని సిఎం చంద్రబాబు అనేక సందర్బాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కువ మంది అధికారుల నిజాయితీ వల్ల కొంత ప్రభుత్వ ప్రతిష్ట మిగిలి ఉందని ఆయనే స్వయంగా చెబుతున్నారు. 

  జిల్లాస్థాయిలో వివిధ విభాగాల్లో అనేక మంది నిజాయితీపరులైన అధికారులతో అభివృద్ధి పనులను పార్టీలకతీతంగా కలెక్టర్‌ అమలు చేయిస్తున్నారు. ఇది చాలా మంది అధికారపార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా మంత్రి పీతల సుజాత కలెక్టర్‌పై పార్టీ నాయకుల వద్ద నోరుపారేసుకుంటున్నారట. ముఖ్యమంత్రి అండదండలు కలెక్టర్‌కు ఉన్నాయని  ఆయనను బదిలీ చేయించడం కష్టమని అధికారపార్టీ నాయకులకు అనుభవంతో తెలిసి రావడంతో మంచితనంతో పనులు చక్కపెట్టుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు.


(505)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ