WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అనుష్క'కు ఏజ్‌బార్‌ అయింది:రకుల్‌...!

తెలుగు సినిమా అగ్రహీరోయిన్‌ 'అనుష్క'కు ఏజ్‌బార్‌ అయిపోయిందని తాజా టాలీవుడ్‌ సంచలనం 'రకుల్‌ప్రీత్‌సింగ్‌' వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 'అనుష్క'పై పరోక్షంగా మాట్లాడుతూ 'బాహుబలి'లో అనుష్క చేసిన 'దేవసేన' వంటి పాత్రలు తాను చేయలేనని, అటువంటి పాత్రలు చేయాలంటే 'అనుష్క'తోనే వీలువతుందని చెప్పింది. అటువంటి పాత్రలు చేసేంత వయసు తనకు లేదని...ఆ పాత్రలు వయసు మళ్లిన 'అనుష్క'నే చేయగలదని వ్యాఖ్యానించింది. అంటే 'అనుష్క'కు ఏజ్‌బార్‌ అయిందని, ముసలితనం వచ్చేసిందని పరోక్షంగా చెప్పడమే కదా..అని సినిమా వర్గాలు అంటున్నాయి. తాను కేవలం మోడ్రన్‌, లవర్‌ పాత్రలు మాత్రమే చేయగలనని, 'బాహుబలి' సినిమాలో 'అనుష్క' ప్రభాస్‌కు తల్లిగా చేసిందని, ఇవన్నీ తనతో అయ్యే పని కాదని సెలవిస్తోంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌, మహేష్‌, ఎన్టీఆర్‌ వంటి టాప్‌ హీరోలతో చేస్తున్న 'రకుల్‌'కు ఆ మాత్రం గర్వం ఉంటుందని సినీవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


(740)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ