లేటెస్ట్

'సోనియాగాంధీ'పై టిడిపి శ్రేణుల ఆగ్రహం...!

కేంద్ర రాజకీయాలు రోజుకు రోజుకు రంగులు మారుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ 'నరేంద్రమోడీ'ని ప్రధాని పదవిలో కూర్చోనివ్వకుండా చేసే ప్రయత్నాలను కాంగ్రెస్‌ ప్రారంభించింది. దీనిలో భాగంగా తనతో విభేదించి పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని, తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నవారిని, కాంగ్రెస్‌ను విలీనం చేయించుకోవాలని ప్రయత్నిస్తున్న పార్టీలను తమతో కలసిరావాలని 'సోనియాగాంధీ' లేఖలు రాస్తున్నారట. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావులను తమ కూటమిలోకి రావాలని 'సోనియా' లేఖ రాశారని ఆ ఆంగ్లపత్రిక పేర్కొంది. తన తండ్రి మరణించిన తరువాత..తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించి స్వంత పార్టీ పెట్టుకున్న 'వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి'ని మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ అడగడం.. ఆసక్తికల్గించేదే. 

ఒకవైపు 'రాహుల్‌గాంధీ'ని ప్రధానిని చేయాలని టిడిపి అధ్యక్షుడు 'చంద్రబాబునాయుడు' దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ.. వివిధ పార్టీలను సంఘటితం చేస్తున్న పరిస్థితుల్లో...'సోనియా' వై.ఎస్‌ కుమారుడికి లేఖ రాయడం టిడిపి శ్రేణులను దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. ఈ లేఖ విషయం వాస్తవమా...? కాదా..? అనే దానిపై స్పష్టత లేకపోయినా... ఎన్నికలు ముగిసిన వెంటనే 'జగన్‌' కోసం రాయబారాలు చేయడం టిడిపి నేతలకు రుచించడం లేదు. 'సోనియాగాంధీ'తో మొదటి నుంచి అంటీ ముట్టనట్లు ఉంటున్న 'చంద్రబాబు' తాజా పరిస్థితులపై ఇంకా స్పందించడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడిగా 'రాహుల్‌గాంధీ' వచ్చినప్పటి నుంచి ఆయన 'చంద్రబాబు'తో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. 'చంద్రబాబు' ఆయనకు మార్గదర్శకుడిగా.. ఢిల్లీ వర్గాల్లో పేరుంది. అటువంటి పరిస్థితుల్లో..'సోనియా' 'జగన్‌'కు లేఖ రాయడంపై టిడిపి శ్రేణులు ఆచితూచి స్పందిస్తు న్నాయి. 'సోనియాగాంధీ'కి ఇంత జరిగినా ఇంకా బుద్దిరాలేదని, ఎవరిని నమ్మకూడదో..వారినే నమ్ముతున్నారని, మరోసారి ఆమె 'జగన్‌,కెసిఆర్‌' చేతుల్లో మోసపోతారని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉన్నా..కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు..ఎటువంటి వారినైనా కలుపుకు పోయేందుకు 'సోనియా' సిద్ధపడుతున్నారని, అందుకే ఆమె ఆ విధంగా చేసి ఉంటారని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. మొత్తం మీద...'సోనియా' వ్యవహారశైలిపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

(564)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ