WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మహేష్‌'తో 'జబర్దస్త్‌' 'రష్మి'...!

బుల్లితెరను, చిన్న సినిమాలను ఊపేస్తున్న 'జబర్ధస్త్‌' యాంకర్‌ 'రష్మి' సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన అవకాశాన్ని దక్కించుకుందట. ఈ విషయం విని సినీ పరిశ్రమకు చెందిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. 'రష్మి' మహేష్‌ను ఏం చూపి పడగొట్టిందా...?అంటూ ఒకటే గుసగుసలు పోతున్నారు. వంశీపైడిపైల్లి, మహేష్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేశారట. ఇప్పటికే 'బిజినెస్‌మెన్‌, బ్రహ్మోత్సవం' చిత్రాల్లో 'మహేష్‌, కాజల్‌'లు హీరోయిన్లుగా నటించారు. మళ్లీ ఇప్పుడు ఈ జోడీ 'వంశీపైడిపల్లి' సినిమాలో మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నారు. ఈ చిత్రం వచ్చే జూన్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగబోతోంది. దీనిలో మొదటి హీరోయిన్‌గా 'కాజల్‌' నటిస్తుండగా, ఈ చిత్రంలో 'మహేష్‌' సన్నిహితురాలుగా 'జబర్ధస్త్‌' 'రష్మి' నటించ బోతుందట. గుంటూరుటాకీస్‌ సినిమాతో యువతను రెచ్చగొట్టిన 'రష్మి', మహేష్‌ సినిమాతో మరోసారి తన అందాలను ఆరబోయబోతుందట.

(265)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ