WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చిరంజీవి'ని కాకాపడుతున్న 'కాజల్‌'...!

'కాజల్‌ అగర్వాల్‌' కనపడదు కానీ..తన పనుల కోసం ఎటువంటి పనులైనా చేస్తుందట. తెలుగులో అవకాశాలు వచ్చినన్ని రోజులూ తెలుగుహీరోలు గ్రేట్‌ అంటూ వాళ్లను ఆకాశానికెత్తిన ఈ అమ్మడు...తరువాత హిందీలో అవకాశాలు రావడంతో తెలుగులో ఇక చేయనంటూ ముంబాయి దారి పట్టింది. అయితే అక్కడ ఈమెను చూసేవారే లేకపోవడంతో మళ్లీ తిరుగుటపాలో 'టాలీవుడ్‌'కు చేరింది. 'అదేమిటి...హిందీ సినిమాలు అంటూ అక్కడకువెళ్లావుగా...అంటే...! వాళ్ల పనితీరు నాకు నచ్చడం లేదంటూ...పనికిమాలిన చెత్త వాగుతూ..తెలుగంటే అభిమానం...ఏదో నాలుగు రూకలు సంపాదించుకోవడానికి 'బాలీవుడ్‌' వెళ్లానంటూ నంగనాచి కబుర్లు చెబుతోంది...సరే...ఏదో విధంగా 'మెగాఫ్యామిలీ'ని పట్టుకుని మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కించుకుంది. 'చిరంజీవి' 150వ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోన్న ఈ అమ్మడు ...ఇప్పుడు 'చిరంజీవి'పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. సీనియర్‌ హీరో అయినా 'చిరంజీవి' సెట్‌లో చాలా సహకరించారని, సెట్‌లో ఎప్పుడూ నవ్వుతూ ఉన్నారని, ఆయనతో డాన్స్‌ చేయడం చాలా కష్టమని...ఇంకా ఏవేవో...చెబుతూ 'చిరంజీవి'ని ఉబ్బిస్తోంది. మరి...ఈమె పొగడ్తలకు 'మెగాస్టార్‌' పడిపోతారా...? ఏమో చెప్పలేం...ఎంత వారైనా 'కాంత' దాసులే...అన్నారో కవి...మరి...ఎంత వారైనా పొగడ్తకు దాసులే...అనుకోవాలి...ఇప్పుడు...!

(348)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ