WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

స్పిన్‌పిచ్‌ల వల్లే భారత్‌ గెలిచింది:అండర్సన్‌...!

వెనకటి...ఆడలేనమ్మ...సాకులు వెతికిన చందంగా ఉంది...ఇంగ్లాండ్‌ జట్టువ్యవహారం...ఐదు టెస్టుల సిరీస్‌లో మరో టెస్టు ఉండగానే సిరీస్‌ ఓడిపోయిన బ్రిటీష్‌ జట్టు తమ ఓటమికి కారణాలు వెతుక్కుంటోంది. స్పిన్‌పిచ్‌ వల్లే భారత్‌ గెలిచిందని...లేకపోతే తామే గెలిచేవారమని ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ అండర్సన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్లోపిచ్‌లను రూపొందించుకుని భారత్‌ గెలిచిందని, పిచ్‌లను రూపొందించడంలో పాటించాల్సిన సాధారణ ధర్మాలను కూడా పాటించలేదని 'అండర్స్‌న్‌' ధ్వజమెత్తాడు. పేసర్లకు ఏ మాత్రం సహకరించని ఈ పిచ్‌లపై భారత్‌ రాణించడం గొప్పేం కాదని అతను వ్యాఖ్యానించాడు. గతంలో ఇంగ్లాండ్‌ పర్యటనకు వచ్చినప్పుడు 'కోహ్లీ' తమ చేతిలో చావు దెబ్బలు తిన్నాడని, ఇప్పుడు మాత్రం అతను సాంకేతికంగా పెద్దగా మెరుగు కాలేదని...కేవలం పిచ్‌ల వల్లే భారీ స్కోర్లు చేయగలుగుతున్నాడని ఆయన విమర్శించారు. మొత్తం మీద అండర్సన్‌ వ్యాఖ్యలు క్రికెట్‌ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.


(235)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ