WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అఖిల్‌' కంటే 'శ్రియా' పెద్దదట...!

'అక్కినేని నాగార్జున' ముద్దుల కొడుకు 'అఖిల్‌' చేసుకోబోయే అమ్మాయి 'శ్రియాభూపాల్‌రెడ్డి' వయస్సులో పెద్దదట. పెద్దదంటే ఒకటి రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా ఐదు సంవత్సరాలు పెద్దదట. ఈ విషయంపై టాలీవుడ్‌లో గుసగుసలు పోతున్నారట. అక్కినేని నాగార్జునకు రెండో కొడుకు అయిన 'అఖిల్‌' తన అన్న అయిన 'నాగచైతన్య'కు పెళ్లి కాకుండానే పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకున్నారు. నాగచైతన్య...సమంతలు ప్రేమించుకుంటున్నారు. వారివురు వచ్చే సంవత్సరంలో వివాహం చేసుకోవాలని భావిస్తుండగా అంతకంటే ముందే 'అఖిల్‌' ఓ ఇంటివాడు కాబోతున్నారు. అయితే 'అఖిల్‌' వివాహం చేసుకోబోయే 'శ్రియా' వయస్సులో తనకన్నా పెద్దదట. ఈ విషయాన్ని 'అఖిల్‌' కానీ ఆయన తండ్రి కానీ పట్టించుకోవడం లేదట. వివాహానికి వయసు పెద్ద అడ్డంకి కాదనేది వారి భావనట. గతంలో క్రికెట్‌ ఆటగాడు 'సచిన్‌' తన కంటే ఏడు సంవత్సరాలు పెద్దది అయిన 'అంజలి'ని పెళ్లి చేసుకున్నాడని, వారు సుఖంగా జీవనం వెళ్లదీస్తున్నారని, అలాగే ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ కన్నా 'అభిషేక్‌బచ్చన్‌' వయసులో పెద్దవాడని అయినా వారు బాగానే ఉన్నారని, అలాగే ఇప్పుడు వీరూ ఉంటారని వారి సన్నిహితులు అంటున్నారు. అయితే ఇంకా చిన్నతనం ఛాయలు తొలగిపోని 'అఖిల్‌' అప్పుడే పెళ్లి చేసుకోవడం...అదీ తన కంటే ఐదు సంవత్సరాల పెద్ద వయస్సు అమ్మాయిని చేసుకోవడంపై కొందరు పెదవి విరుస్తున్నారు.

(242)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ