WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'శేఖర్‌రెడ్డి'తో 'తిరుమల' అధికారుల కుమ్మక్కు...!

'శేఖర్‌రెడ్డి' తొలగింపులో ఆగమేఖాలపై స్పందించిన చంద్రబాబు తిరుమలలో ఆయనకు సహకరించిన వారు, రెడ్‌కార్పెట్‌ వేసిన వారిపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. కనీసం విచారణ కూడా జరిపించలేదు. దీనిపై పలువురు మీడియా ప్రతినిధులు ఉన్నతాధికారులను ప్రశ్నించగా వారు సమాధానం దాట వేశారు. 'తిరుమల'లో ఎల్‌-1 దర్శనానికి 'శేఖర్‌రెడ్డి' సిఫార్సులతో వేలమంది 'శ్రీవారి' దర్శనం చేసుకున్నారు. సినిమా నటులు, పారిశ్రామికవేత్తలు, లిక్కర్‌ వ్యాపారాలు ఇతర కోటీశ్వరులు పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. అంతే కాకుండా ఇతర ముఖ్య దర్శనాలల్లో 'శేఖర్‌రెడ్డి' సిఫార్సులు బాగా పనిచేశాయి. ఆయన సిఫార్సు లేఖతో జెఇఒ కార్యాలయానికి వెళితే అక్కడ పనిచేసే ఉద్యోగులు, ఇన్‌ఛార్జిలు ఆగమేఘాలపై వారి పనులు చక్కపెట్టేవారు. ఈ విషయంలో జెఇఒ శ్రీనివాసరాజు కూడా 'శేఖర్‌రెడ్డి'కి బ్రహ్మరథంపట్టారు. ఖరీదైన కానుకలతో పాటు ఇతర బంగారు వస్తువులను కానుకల రూపంలో చాలా మందికి తిరుమలలో అందాయి.

     'జనంప్రత్యేక ప్రతినిధి' తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఎల్‌-1 టిక్కెట్‌ కోరగా జెఇఒ నిరాకరించారు. ఆ తరువాత ఆయనకు తెలిసిన సమాచారం ప్రకారం ఎల్‌-1 కేటగిరిలో సుమారు 300మంది దర్శనం చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందిన వారు కావడం విశేషం. అక్కడ పనిచేస్తున్న అధికారులు కూడా దీన్ని దృవీకరించారు. 'శేఖర్‌రెడ్డా' మజాకా...? ఆయన ఫోన్‌ చేస్తే ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని ఆగమేఘాలపై లభించేవి. 'శేఖర్‌రెడ్డి' సిఫార్సులతో తమిళనాడు నుంచి వచ్చిన ముఖ్యులకు 'శ్రీవారి' వస్త్రం కూడా లభించేవి. ఆయనకు అంత సహకరించిన తిరుమల జెఇఒ శ్రీనివాసరాజు ఆయన కార్యాలయ సిబ్బంది టెంపుల్‌ అధికారులపై విచారణ జరుపుతారా...? దీనిపై సిఎం చంద్రబాబు ఎందుకు దృష్టిసారించడంలేదు. 

    విచిత్రం ఏమిటంటే విపక్షాల నాయకులు కూడా దీనిపై మౌనం వహిస్తున్నారు. ఎవరి స్వార్థం వారిది...! తిరుమలలో ఈ సంవత్సరంలో ఎల్‌-1 పద్దతి ద్వారా ఎవరెవరు సిఫార్సుల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారో వారి వివరాలు బయటపడితే 'శేఖర్‌రెడ్డి' సిఫార్సులు అన్నీ బయటకు వస్తాయి. ఎల్‌-1 ద్వారా అనామకులు కూడా 'శ్రీవారి'ని దర్శించుకుంటున్నారని మీడియా ప్రతినిధులు సంబంధిత ఉన్నతాధికారులు పలుసార్లు ఫిర్యాదులు చేసినా వారు ఏనాడూ స్పందించలేదు. ఈ తతంగం అంతా దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, టిటిడీ ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తికి కూడా తెలుసు. అయినా కూడా ఏ ఒక్కరూ దానిపై దృష్టిసారించలేదు. దీంతో 'శేఖర్‌రెడ్డి' చెలరేగిపోయి 'చెన్నయ్‌', బెంగుళూరులలోని పారిశ్రామికవేత్తలకు, కోటీశ్వరులకు దర్శనాలను చేయించారు. కొంత మందికి దగ్గర ఉండి...మరికొంత మందికి తన అంతరంగికుల ద్వారా దర్శనాలు చేయించారని ఈ తతంగాన్ని ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపే ధైర్యం ప్రభుత్వానికి ఉందా...?

(380)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ