సంకెళ్లు వేస్తారేమో..!? అంత సీన్ వాళ్లకు లేదులే...!?
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు చాలా మంది సీనియర్ అధికారులు వణికిపోయారట. ముఖ్యంగా జగన్‌కు వీరవిధేయులుగా, కట్టప్పలుగా పనిచేసిన ఐఏఎస్, ఐపిఎస్, ఐఐఎస్ అధికారులు వీరిలో ఉన్నారట. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు మళ్లీ జగన్‌దే గెలుపని వీరు గట్టిగా నమ్మారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారు..మనకుమళ్లీ ఇంతకంటే మంచి పోస్టులు దక్కుతాయి..వచ్చిన పోస్టులతో..సగం జగన్‌కు దోచిపెట్టి మిగతాది తాము దోచేద్దామనే భావనతో..ఎన్నికల ఫలితాలను ఆస్వాదించడానికి అన్ని హంగులతో ఆశీనులయ్యారట. అయితే..ఎన్నికల్లో ముందు పోస్టల్ బ్యాలెట్‌ల ఫలితాలు వచ్చినప్పుడు కూడా వీరు..జగన్‌దే గెలుపని, పోస్టల్ ఓట్లు ఉద్యోగులవి కనుక వారు..ఎటూ జగన్‌కు ఓటువేయరు..కనుక మొదటి ఫలితాలను వీరు తేలిగ్గా తీసుకున్నారు. అసలైన ఫలితాలు ఇంకా ముందు ఉన్నాయని సర్ది చెప్పుకున్నారు. అయితే..అసలైన ఫలితాలు వెలువడుతుండడం..అవన్నీ ఏకపక్షంగా ఎన్‌డిఏ కూటమివైపు ఉండడంతో వీరికి చెమటలు పట్టాయట. ఒకటే ఆందోళ, ఆక్రోశం, అసహనంతో చిందులు వేశారట. కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చి కీలక పదవులు నిర్వహించిన వారైతే భయంతో వణికిపోయారట. పక్కనున్నవారు సర్ది చెప్పినా వీరిలో వణుకు తగ్గలేదట. ఎందుకు వారు ఈ విధంగా వణికిపోయారంటే..చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో తాము చేసిన అక్రమాలకు సంకెళ్లు వేస్తారనే భయంతోనేనట. జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా అవినీతికి, అక్రమాలకు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన సదరు అధికారులు..ఇంకేముంది..చంద్రబాబు, ఆయన తనయుడు అధికారంలోకి రావడంతోనే...తమకు సంకెళ్లు వేసి పోలీసు జీపులు ఎక్కిస్తారని, దీంతో తమ పరువు, కుటుంబ పరువు గంగలో కలిసిపోతుందనే భయంతో వెర్రిచూపులతో..భయంతో వణికిపోయారట. మీకు ఏమీ కాదు..మీరు అధికారులు కదా..అంటే..మీదేం పోయింది..మమ్మలనే ముందు పోలీసులు అరెస్టు చేస్తారని భీతితో బీపీలు పెంచుకుని మంచాలకు అడ్డం పడిపోయారట. కొందరైతే..వెంటనే హైదరాబాద్, బెంగుళూరు..ఢిల్లీ, కొలకొతా వంటి ప్రాంతాలకు పరుగులు పెట్టారట. అయితే..ఇదంతా వారి భయాలేనని, వాస్తవంలో అవేం జరగలేదని ఇప్పుడు వారు తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటున్నారట. అనవసరంగా భయపడ్డాం..చంద్రబాబు సంగతి తెలిసి కూడా ఎందుకు భయపడ్డాం..అంటూ ఇప్పుడు ఆయన గురించి వెకిలిగా మాట్లాడుకుంటున్నారట. లోకేష్ రెడ్‌బుక్ అన్నాడని, ఆయనేదో..చెస్తాడని, తాను చంద్రబాబు అంత మంచివాడిని కాదంటూ..ఆయన పాదయాత్రలో కేకలు వేసి చెబుతుంటే..నిజమేననుకున్నాం..కానీ..ఆయన కూడా చంద్రబాబు వలే పిరికివాడే..అంటూ ఇప్పుడు ఎద్దేవా చేస్తున్నారట. జగన్ వలే..వీరు చేయలేరు..చేయరు కూడా..అనవసరంగా భయపడ్డాం..వీళ్లేమి చేస్తారు..అంటూ తండ్రీకొడుకులను తేలిగ్గా మాట్లాడుతున్నారు. వాస్తవానికి వాళ్లు చెప్పిందే..జరుగుతోంది కూడా. జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఏ ఒక్క అధికారిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు దర్జాగా ఇక్కడ నుంచి వెళ్లిపోతున్నారు. లేకపోతే..గౌరవంగా రిటైర్ అవుతున్నారు..తప్ప..చంద్రబాబు..ఆయన కుమారుడు చేసిందేమీ లేదు.