WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

శేఖర్ రెడ్డి అరెస్ట్

దేశవ్యాప్తంగా నోట్ల మార్పిడిలో అతి పెద్ద స్కామ్ కు తెరతీసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ మాజీ సభ్యులు, తమిళనాడు మైనింగ్ వ్యాపారి శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు. సీబీఐ దాడుల్లో శేఖర్ రెడ్డి ఇంట్లో రూ.70 కోట్ల కొత్త నోట్లు దొరకటం సంచలనం అయ్యింది. ఆయన సోదరుడు, బంధువుల ఇళ్లలో మూడు రోజులు సాగిన సోదాల్లో రూ.106 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 127కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. దీని విలువ 40 కోట్ల వరకు ఉంటుందని అంచనా. చెన్నై, కాడ్పడి, చిత్తూరు ప్రాంతాల్లో ఈ దాడులు చేసింది. ఈ నగదుకు లెక్కలు చూపించకపోవటంతో.. శేఖర్ రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాసరెడ్డి, ఆడిటర్ ప్రేమ్ లను అరెస్ట్ చేసింది సీబీఐ. కోర్టులో హాజరుపరచగా జనవరి 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. శేఖర్ రెడ్డికి కొత్త రూ.2వేల నగదు.. నోట్ల ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా వచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనా విచారణ వేగవంతం చేసింది.

(473)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ