లేటెస్ట్

టోల్‌గేట్‌ వద్ద మంత్రి పుల్లారావు భార్య హల్‌చల్‌...!

రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి 'పత్తిపాటి పుల్లారావు' భార్య తెలంగాణలోని టోల్‌గేట్‌ వద్ద హల్‌చల్‌ చేసింది. టోల్‌గేట్‌ వద్ద ఫీజు కట్టమన్నందుకు ఆమె అక్కడి సిబ్బందిపై వాగ్వివాదానికి దిగారు. తాను ఎమ్మెల్యే భార్యనని...తాను టోల్‌ఫీజు కట్టాల్సిన అవసరం లేదని ఆమె వాదించారు. కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉందని, టోల్‌ఫీజ్‌ మినహాయింపు ఉందని ఆమె టోల్‌సిబ్బందికి చెప్పగా వారు తిరస్కరించారు. ఎమ్మెల్యే ప్రయాణించేటప్పుడు మాత్రమే టోల్‌ఫీజు ఉండదని, వారి కుటుంబసభ్యులు ప్రయాణించేటప్పుడు కానీ..లేదా ఇతరులు ఆ వాహనాన్ని వాడినప్పుడు కానీ...టోల్‌ఫీజ్‌ వసూలు చేస్తామని టోల్‌సిబ్బంది ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. మంత్రి భార్య ఎంత వాదించినా..టోల్‌సిబ్బంది దిగిరాలేదు. తాను...ఎవరో తెలుసా..? అంటూ ఆమె టోల్‌సిబ్బందికి చెప్పగా..మంత్రి అయినా..వారి భార్య అయినా...నిబంధనల మేరకు నడుచుకుంటామని..మంత్రి కుటుంబసభ్యులకు ప్రత్యేక సౌకర్యాలు ఉండవని, టోల్‌ఫీజు కట్టకుండా వెళ్లనిచ్చేది లేదని..వారు గట్టిగా చెప్పడంతో..చివరకు మంత్రి భార్య దిగివచ్చారు. టోల్‌ఫీజు చెల్లించి వెళ్లిపోయారు. చిన్న విషయానికి రాద్ధాంతం చేసిన మంత్రి భార్య వ్యవహారంపై టోల్‌ సిబ్బందితో పాటు ఇతరులూ చర్చించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తన భర్త మంత్రిగా వ్యవహరిస్తుండగా..అనేక విషయాల్లో ఆమె తలదూర్చారని, నియోజకవర్గంలో ఆమె చక్రం తిప్పారని విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఏ పనికావాలన్నా..ఆమె వద్దకే వెళ్లాలని, అంతే కాకుండా.. మంత్రి పుల్లారావు వివిధశాఖలకు మంత్రిగా ఉన్నప్పుడు ఆమె ప్రతి విషయంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖలో ఆమె అనాధికార మంత్రిగా పెత్తనం చెలాయించారనే మాట సచివాలయంలో వినిపిస్తోంది. ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లు, ఇతర విషయాల్లో అంతా ఆమె వ్యవహరించారని, ఈ విషయాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే విమర్శలు ఉన్నాయి. మొన్నటి దాకా..అధికార దర్పం వెలగబెట్టిన మంత్రి భార్య..తాజాగా..తన నియోజకవర్గంలో వ్యవహరించినట్లు తెలంగాణలో వ్యవహరించబోయి..పరువు పోగొట్టుకున్నారు. కేవలం రూ.100 లేక రూ.200/- విషయంలో ఆమె రాద్ధాంతం చేయడం, యాగీ చేయడంతో మంత్రి పరువుపోయినట్లు అయింది. నిబంధనల ప్రకారం ఉంటే ఎవరైనా..తమ హక్కులను కాపాడుకోవచ్చు. కానీ..లేని దాని కోసం అనవసర యాగీ చేసి పరువుపోగొట్టుకోవడం ఏమిటో...?(1512)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ