WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నాకు 'సూర్య' నటన అంటే చాలా ఇష్టం...!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ్ముడు కొడుకు అయిన 'నారా రోహిత్‌' తెలుగు సినిమాల్లో చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయన ఎంచుకునే కథల్లో వైవిద్యం ఉంటుంది. ఆయన నటించిన పలు చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్కించాయి. అతి పెద్ద రాజకీయ కుటుంబం నుంచి సినిమాల్లో హీరోగా వచ్చిన 'నారా రోహిత్‌' ఎప్పుడూ  తనదైన శైలిలోనే ముందుకు వెళతారు. ఇటీవల ఆయన ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ..తనకు తమిళ సినిమా హీరో 'సూర్య' నటన అంటే చాలా ఇష్టమని చెప్పారట. అంతే కాక ఆయనను చూసే తాను సినిమాల్లోకి వచ్చానని చెప్పారట. గతంలో తనకు సినిమాలంటే ఆసక్తి లేదని, కానీ 'సూర్య' నటను చూసిన తరువాత సినిమాల్లోకి వచ్చానని ఆయన చెప్పుకున్నారు. కమర్షియల్‌ సినిమాలతో ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేక 'బాణం' సినిమాను ఎంచుకున్నానని, తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చానని ఆయన అన్నారు. తెలుగు సినిమా హీరోల్లో 'బాలకృష్ణ,ది చిన్నపిల్లల మనస్వత్యం అని 'చిరంజీవి' డాన్స్‌ అంటే చాలా ఇష్టమని చెప్పారు. కొన్ని సినిమాల్లో 'చిరంజీవి' సీన్లు ఇమిటేట్‌ చేస్తానని, జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేష్‌ వంటి స్టార్‌లను ఇంత వరకు కలుసుకోలేదని చెప్పారు.

(176)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ