WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నాగచైతన్య' కాబోయే భార్య హాట్‌హాట్‌ స్టిల్స్‌...!

'అక్కినేని నాగచైతన్య' సినీ నటి 'సమంత'ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా...! అయితే పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పిన 'సమంత' ఆ క్రేజ్‌ కాపాడుకునేందుకు హాట్‌ హాట్‌ స్టిల్స్‌ ఇచ్చి ప్రేక్షకులను కవ్విస్తోంది. ఇంతకు ముందు సినీహీరోయిన్‌గా ఆమె ఎంత ఎక్స్‌ఫోజ్‌ చేసినా పెద్దగాపట్టించుకోని 'జనం' ఇప్పుడు 'అక్కినేని'వారి కోడలు అవుతున్న నేపథ్యంలో ఆమె ఇచ్చిన హాట్‌స్టిల్స్‌ సోషల్‌మీడియాలో సంచలనంసృష్టిస్తున్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా ఈ రోజు బీచ్‌లో స్నానం చేస్తున్న ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. అంతే కాకుండా ఆమె వెనుకభాగం కనిపించేలా...తీసిన ఫోటోను నెట్‌లో పెట్టి అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపింది. ఆమె చేసిన ఈ పని 'అక్కినేని' కుటుంబాన్ని అభిమానించేవారికి ఇబ్బంది కల్గించింది. గతంలో ఆమె ఏ విధంగా వ్యవహరించినా పట్టించుకోని వీరు ఇప్పుడు ఈరకంగా చేయడం తమకు బాధిస్తుందని...ఇలా చేయవద్దని ఆమెను కోరారు.


(451)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ