లేటెస్ట్

'లగడపాటి' సర్వేలో టిడిపికి 103 సీట్లు...!

తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠతగా ఎదురు చూస్తోన్న 'లగడపాటి రాజగోపాల్‌' సర్వే ఆదివారం సాయంత్రం విడుదల కాబోతోంది. అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా..ఆయన సర్వేను 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' సంపాదించింది. ఈ సర్వేలో అధికార టిడిపికి 103 సీట్లు వస్తాయని తేలింది. రాష్ట్రంలోని 175సీట్లల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి...? అభ్యర్థులకు ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై 'లగడపాటి' వివరంగా సర్వే వివరాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన సర్వే ప్రకారం అధికార టిడిపి మరోసారి అధికారంలోకి రాబోతోంది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో టిడిపి హవా కనిపించింది. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, 'చంద్రబాబు' అనుభవాన్ని ఓటర్లు పరిగణలోకి తీసుకున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది. 

రాయలసీమలోనూ..టిడిపి హవా...!

రాయలసీమలో మొత్తం 52 సీట్లు ఉంటే...టిడిపి ఈసారి సగం సీట్లు సాధిస్తుందని 'లగడపాటి' సర్వే స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో టిడిపికి 'రాయలసీమ'లో 23 సీట్లు వస్తే...ఈసారి ఆ సంఖ్య పెరుగుతుందని 'లగడపాటి' సర్వే తెలిపింది. రాయలసీమలోని కర్నూలు,అనంతపురం,చిత్తూరు, కడప జిల్లాల్లో కేవలం కడప జిల్లా తప్ప మిగితా మూడు జిల్లాల్లో టిడిపి ఆధిపత్యం సాధించబోతోంది.

రాజధాని జిల్లాల్లో మెజార్టీ సీట్లు...!

రాజధాని ప్రాంతమైన కృష్ణా,గుంటూరు జిల్లాల్లో టిడిపి మెజార్టీ సీట్లు సాధించబోతున్నట్లు సర్వే స్పష్టం చేస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గత ఎన్నికల్లో 22 సీట్లు సాధిస్తే..ఈసారి 25సీట్లు సాధిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైకాపా ఈ రెండు జిల్లాల్లో 10సీట్లు సాధించగా..ఈసారి ఆ సీట్లను నిలబెట్టుకోవడం కష్టమనేని సర్వే స్పష్టం చేసింది.

గోదావరి జిల్లాలు టిడిపి వైపే...!

పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోనూ టిడిపి హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ 34 సీట్లు ఉంటే దాదాపు 20కి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. త్రిముఖ పోటీలో టిడిపి స్పష్టమైన ఆధిపత్యం సాధించినట్లు తెలుస్తోంది.సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ వల్ల టిడిపి లబ్దిపొందబోతున్నట్లు సర్వే సష్టం చేస్తోంది. 

ఉత్తరాంధ్రలోనూ మెజార్టీ సీట్లు...!

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనూ టిడిపి ఆధిక్యం కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో టిడిపి మెజార్టీ సాధించబోతుండగా...విజయనగరం జిల్లాలో పైచేయి కోసం రెండు పార్టీల మధ్యహోరా హోరి పోరు జరిగింది. ఉక్కునగరం విశాఖలో మరోమారు గత ఎన్నికల ఫీట్‌ను టిడిపి పునరావృతం చేయనుంది. నెల్లూరు జిల్లాలో వైకాపా ఆధిపత్యం సాధిస్తుంది. ప్రకాశం జిల్లాల్లో టిడిపికే మెజార్టీ సీట్లు వస్తాయని 'లగడపాటి' సర్వే స్పష్టం చేసింది. మొత్తం మీద.. చూసుకుంటే..రెండు,మూడు జిల్లాలు తప్ప..మిగతా జిల్లాల్లో టిడిపి హవా కనిపించిందని 'లగడపాటి' సర్వే స్పష్టం చేసింది. 

(15066)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ