WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అవినీతి'పై కలెక్టర్ల సమావేశంలో 'బాబు' మౌనం...!

ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశాల సందర్భంగా అన్ని జిల్లాలో జరుగుతున్న అవినీతిపై 'ఆంధ్రజ్యోతి' పత్రిక ప్రచురించిన కథనాలపై స్పందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాకరించారు. ఎవరెవరో ఏవో కథనాలు రాస్తారు..వాటిపై చర్చ జరిపాల్సిన అవసరం నాకేమిటి...? అని ఆయన గంభీరంగా వ్యవహరించారట. అన్ని జిల్లాల్లో అమాత్యులు, వారి కుటుంబసభ్యులు..పిఎలు, పిఎస్‌లు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఇతర ముఖ్యనాయకుల అవినీతిపై ఆ పత్రిక ప్రచురించిన కథనాలపై కొంత మంది కలెక్టర్లు ఆఫ్‌ ది రికార్డుగా స్పందిస్తూ ఆ పత్రిక అవినీతిపై చాలా తక్కువస్థాయిలో కథనాలు ప్రచురించింది. మేము నోరు విప్పితే నాయకుల గుట్టురట్టు అవుతుంది...!మౌనంగా భరిస్తున్నాం...ఇంకెన్నాళ్లు భరించాలో అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శాఖాధిపతులు, డైరెక్టరేట్‌ అధికారులు ఈ కథనాలపై బాహాటంగా స్పందించకపోయినా... నలుగురు కూర్చున్నప్పుడు చర్చ జరిగింది. 

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అనేక శాఖల్లో పనిచేశాం...ఇంత దారుణమైన అవినీతి మేము చూడలేదు...అప్పట్లో ముఖ్యంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణాలపై విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వాటి జోలికి వీరెవరూ వెళ్లడం లేదు..అక్రమంగా ఏ విధంగా సంపాదించవచ్చా...? అన్ని మార్గాలను వెతికారు..కొన్ని మార్గాలు అనుకూలంగా కనిపించాయి.దీంతో విపక్షనాయకుల తోడ్పాటు కూడా వారికి కలిసి వచ్చింది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు రెండుపార్టీల నాయకులు వాటాలు వేసుకుని దోచిపడేస్తున్నారు. గతంలో కొంత భయమైనా ఉండేది..ఈసారి భయం వారిలో కనిపించలేదు...అని వారు చర్చించుకుంటున్నారట. 

  13 జిల్లాల కలెక్టర్లల్లో నలుగురిపై ఆరోపణలు వచ్చాయి...తప్ప...మిగతా వారందరూ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు...వారి బాటలోనే శాఖాధిపతులు నడుస్తున్నారు...తమను ముఖ్యమంత్రి పిలిచి జిల్లాల్లో ఏం జరుగుతుందో అడగలేదు..ఆయనకిష్టమైనప్పుడు మనకెందుకులే..అని తాము మౌనం వహించామని చెప్పుకున్నారట. ఇప్పటికే పరిస్థితి చేయిజారిపోయిందని, కళ్లు తెరవకపోతే మిగిలేది శూన్యమేనని వారు పెదవి విరిచారు. కలెక్టర్ల సమావేశంలో అవినీతిపై చర్చ జరగకపోవడానికి కారణం ఆంధ్రజ్యోతి పత్రిక కథనాలే కారణమని వీరు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అవినీతిపై ముఖ్యమంత్రి ఇప్పటికీ మెతకవైఖరినే అవలంభిస్తున్నారని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

(207)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ