WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జలీల్‌ఖాన్‌' పాండిత్యం...చూడండి...!

విజయవాడ ఎమ్మెల్యే 'జలీల్‌ఖాన్‌' దెబ్బకు పాపం...ఆ జర్నలిస్టుకు మూడు రోజుల నుంచి జ్వరమట. ఏదో ఓ ఇంటర్వ్యూ చేద్దామనుకున్న పాపానికి...ఇంతలా బెదరగొట్టాలా...? మతి పోగొట్టి చంపుకుతినాలా...? మరి ఏం చేస్తాం...ఏ ఉద్యోగం దొరక్క...చివరకు ఈ ఉద్యోగానికి వస్తే...ఇక్కడ ఉన్న నాయకగణం పాండిత్యానికి చొక్కాలు చింపుకుని కృష్ణాబ్యారేజీలో దూకుదామనకునే లోపలే...పెళ్లాం..పిల్లలు గుర్తొచ్చి ఆగిపోయాడు ఆ జర్నలిస్టు...ఇంతకీ 'జలీల్‌ఖాన్‌' ఆ జర్నలిస్టునేం కొట్టలేదు..తిట్టలేదు..జస్ట్‌...తనలో దాగి ఉన్న విద్యా నైపుణ్యాన్ని బయటకు తీశాడు...అంతే ఇంటర్వ్యూ చేసే జర్నలిస్టు...మైండ్‌బ్లాంక్‌ అయి...బొమ్మ కనపడింది..మనవాడి పాండిత్యానికి...మీరు చూడండి..

జర్నలిస్టు: 'సార్‌...మీరేం చదువుకున్నారు...సార్‌...!

జలీల్‌ఖాన్‌: బి.కాం..!

జర్నలిస్టు: ఏం సార్‌..కామర్స్‌ అంటే అంత ప్రేమ ఎందుకు సార్‌...ఛార్టెట్‌ ఎకౌంట్‌ కావాలనుకున్నారా...ఏం...?

జలీల్‌ఖాన్‌: అలా ఏమీ కాదు...నాకు మేథ్స్‌ అంటే ఇంట్రస్ట్‌...ఫిజిక్స్‌ అంటే ఇంట్రస్టూ...! అందుకే దానిలోకెళ్లాం...

జర్నలిస్టు: బి.కాం..అంటున్నారూ...! మేథ్స్‌, ఫిజిక్స్‌ బి.కాంలో ఉండవు కదా...?

జలీల్‌ఖాన్‌: ఉంటుంది..ఉంటుంది. ఫిజిక్స్‌ ఎందుకు ఉండదు..బి.కాంలో...? కామర్స్‌ అంటే ఎకౌంట్సే గదా..?

జర్నలిస్టు:నేను..బి.కామ్‌ స్టూడెంట్‌ని...!

జలీల్‌ఖాన్‌: ఏముంటది దాంట్లో...!

జర్నలిస్టు: కామర్స్‌ ఉంటది..స్టాటిక్స్‌ ఉంటది...ఫస్ట్‌ఇయర్‌,సెకండ్‌ ఇయర్‌లో గ్రూప్స్‌వేరు..ఫైనల్‌ ఇయర్‌లో మనకు ఇన్‌కమ్‌ట్యాక్స్‌...ఎమ్‌లా ఉంటాయి.

జలీల్‌ఖాన్‌:అవన్నీ ఎకౌంట్సే...!

జర్నలిస్టు: ఎకౌంట్స్‌..మరి మీరు చెప్పేది మేధ్స్‌, ఫిజిక్స్‌ అంటున్నారు...!

జలీల్‌ఖాన్‌: మేథ్స్‌ కూడా ఎకౌంట్సే కదా...!ఇప్పుడూ మీరు చెప్పినట్లు ఎకనామిక్స్‌ సంబంధించి ఉంటది..!మీరు చెప్పినట్లు అన్నీ ఉంటాయి...! దాంతో పాటు ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ కూడా ఉంటది కదా...!

జర్నలిస్టు:ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌ బి.కామ్‌లో ఉండదు సర్‌...మీరోసారి మళ్లీ సరిచూసుకోండి సార్‌...!

జలీల్‌ఖాన్‌: మర్చిపోయి ఉంటా... మేథ్స్‌ మాత్రం డెఫినెంట్‌గా ఉంటుంది...

జర్నలిస్టు: మేథ్స్‌ అంటే కామర్స్‌...!

జలీల్‌ఖాన్‌: కామర్స్‌ అంటే నేను క్యాలిక్‌లేటర్‌ కూడా చేయను..అంతా నాకు మేథ్స్‌లో హండ్రెకు హండ్రె మార్కులు వచ్చాయి...!

జర్నలిస్టు: టెన్త్‌ క్లాస్‌ నుండి హండ్రెకు హండ్రె వచ్చేయా...?

జలీల్‌ఖాన్‌:చెల్డ్‌హుడ్‌ నుంచి...!

జర్నలిస్టు: చైల్డ్‌హుడ్‌ నుంచా...?




(1275)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ