WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పోస్టింగ్‌ల్లోనూ లంచాలే...!

జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ముఖ్యంగా పోలీసు,రెవిన్యూ,విద్యా,ఎక్సైజ్‌, కమర్షియల్‌టాక్స్‌, రిజిస్ట్రేషన్‌ స్టాంప్స్‌ శాఖల్లో బదిలీలు, పోస్టింగ్‌లు లక్షలు ముట్టచెబితే కానీ జరగడం లేదు. జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులకు కూడా ఈ లంచాల బాగోతం తెలిసినప్పటికీ ప్రజాప్రతినిధులతో గొడవ ఎందుకులే అని సర్దుకుపోతున్నారు. పోలీసుల బదిలీల్లో రాజకీయ,అధికార సిఫార్సులకు ప్రాముఖ్యత లభిస్తున్న నేపథ్యంలో రెండుచోట్ల లంచాలు ఇచ్చుకునే పరిస్థితులు కొన్ని జిల్లాల్లో ఏర్పడ్డాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు కూడా లిఖిత పూర్వకంగా సిఫార్సు చేస్తే పోస్టుకు తగ్గ సొమ్మును నిర్భంధంగా వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్‌ మరియు స్టాంపులు, రెవిన్యూ,పోలీసు, ఎక్సైజ్‌శాఖల బదిలీలు, పోస్టింగ్‌ల్లో అధికార ప్రమేయం కన్నా, రాజకీయ ప్రమేయమే బాగా పనిచేస్తుంది. దీంతో మండలస్థాయిలో అనుచరులు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు.. తల దూరుస్తున్నారు. 

  బదిలీలు, పోస్టింగ్‌లు ఏ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదని, నిజాయితీపరులైన ప్రజాప్రతినిధులు మీడియా వర్గాలతో చెబుతూ వాపోతున్నారు. ఏ అధికారికి ఏ పోస్టింగ్‌ కావాలన్నా సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ...నియోజకవర్గ ఇన్‌ఛార్జి కానీ లిఖిత పూర్వకంగా సిఫార్సు చేయాల్సిందే. ఈ విషయంలో ప్రత్యర్థులు కూడా అధికారవర్గంతో చేతులు కలుపుతున్నారు. 70 నుండి 80శాతం అధికారపార్టీ వారికి దక్కితే 30శాతం ప్రతిపక్షానికి ముడుపులు దక్కుతున్నాయట. జిల్లా స్థాయి పోస్టులలో ఈ విధంగా పంచుకుంటుండగా...కనీసం ఇదేమిటి...? అని అడగాల్సిన విపక్షాల నాయకులు ఇతర విషయాలపై దృష్టిసారిస్తున్నారు తప్ప..దీనిపై దృష్టిసారించడం లేదు. గత రెండున్నరేళ్ల నుంచి జరిగిన బదిలీలు, పోస్టింగ్‌లు, ఇసుక దందాలపై బాహాటంగా విమర్శలు చేసిన విపక్షాల నాయకులు అరుదుగా కనిపిస్తున్నారు. వీరిపై జిల్లాల కలెక్టర్లు, డైరెక్టరేట్‌ అధికారులు, శాఖాధిపతులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఆఖరి నిమిషంలో అధికార సిఫార్సుల ప్రమేయమే బాగా పనిచేస్తుంది. 

  ఇటీవల ఒక జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలపై మీడియా వర్గాలు విపక్షాల నాయకులను ప్రశ్నించగా...'మాదేముంది..బ్రదర్‌..మేము విమర్శలు చేసినా...ఆరోపణలు చేసినా...జరిగే పనులు ఆగుతాయా...? మేము అధికారంలో ఉన్నప్పుడు..మేము..ఇప్పుడు వాళ్లు అధికారంలో ఉన్నారు..కనుక వాళ్లు...అప్పుడు వాళ్లు విమర్శించలేదు..ఇప్పుడూ మేము..అదే దారిలో ఉన్నాం..ఇప్పుడు మీరు మమ్ములను అడగి ఇబ్బంది పెట్టవద్దు..అని చెబుతున్నారంటే దొంగలు..దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో చూసేమే తప్ప...ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని...ప్రస్తుతం కళ్లారా...? చూస్తున్నామని రాజకీయ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

(210)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ