WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'పై 'జెసి' సంచలన వ్యాఖ్యలు...!(వీడియో)

'అనంతపురం' ఎంపి జెసి దివాకర్‌రెడ్డి ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌మ్మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జగన్‌' తనకు చిన్నప్పటి నుంచి తెలుసనని అంటూ..ప్రాజెక్టులు అడ్డుకుంటున్న తీరుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. 'మా వాడు ఉన్నాడు ...జగన్‌..వాడేం మాట్లాడతాడో...వాడికే తెలియదు... ఎవరైనా... తిక్కముండా కొడుకు కాకపోతే... ప్రజల ఓట్ల కావాలనుకునే వాడు...అభివృద్ధి పనులకు అడ్డంపడతాడా.. 'పట్టిసీమ'కు వ్యతిరేకంగా మాట్లాడతాడా...? పల్లెటూరులో చదువు రానటువంటి వాడు కూడా ...'పట్టిసీమ' కావాలా...తనకు పోలవరం కావాలా...అంటుంటే...'జగన్‌'..మాత్రం...అయామ్‌ సారీ...! వాడని ఎందుంటు న్నానంటే...ఐ...నో దట్‌ ఫెల్లో...చెల్డ్‌హుడ్‌...చిన్నప్పటి నుంచి తెలిసిన వాడు...కొంత 'రాజశేఖర్‌రెడ్డి'తో ఉన్న అనుబంధం వల్ల  వాడితో కూడా నాకు అనుబంధం ఉంది. 

  ఇక రెండోది...కులం...ఏం కులం కూడు పెడుతుందయ్యా...? నాకు అర్థంకాలా...? వాడి నమ్ముకుంటే దేశం అంతా నాశనం అయిపోతుంది... అనంతపురం జిల్లాలో 'రెడ్డి' కులం మొత్తం ఇక్కడే ఉంది...'సార్‌...ఇవాళ...'రెడ్డి' కులంవాళ్లు...ఇతర కులాల వాళ్లని పెళ్లి చేసుకున్నంతగా వేరే కులం వాళ్లు ఎవరో పెళ్లి చేసుకోవడం లేదు..అంటూ 'జెసి' తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఆయన ప్రసంగిస్తూ...2014 ఎన్నికలకు ముందు తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పరిస్థితి చూస్తే...'జగన్‌' ఎన్నికల్లో గెలుస్తాడని అంచనా వేశానని...ఆ రోజు ఇదే విషయాన్ని తాను 'చంద్రబాబు'కు కూడా చెప్పానని తెలిపారు. అయితే రాష్ట్రానికి అభివృద్ధి చేసే నాయకుడు కావాలని తాను టిడిపిలో చేరానని, ముఖ్యమంత్రి మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఇకేం కావాలని ప్రశ్నించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ చంద్రబాబును వ్యతిరేకించేదని, అయితే తాను మాత్రం ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తున్న మంచి పనులను అప్పటి ప్రతిపక్షనేత రాజశేఖర్‌రెడ్డిని కాదని ప్రశంసించానని, మంచి పనులు చేసే నేతలు ప్రశంసించడం తప్పుకాదని ఆయన చెప్పుకున్నారు. మొత్తం మీద ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌పై 'జెసి' దివాకర్‌రెడ్డి చేసిన విమర్శలు సంచలనం సృష్టిస్తున్నాయి...క్రింది వీడియోలో 'జెసి' వ్యాఖ్యలు చూడండి...!




(1398)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ