WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నన్నెవరూ తొక్కేయలేరు:హేమ...!

కాపు సంఘం సమావేశంలో పాల్గొన్న తనకు సినిమాల్లో అవకాశాలు రాకుండా చేయలేరని సినీనటి హేమ అన్నారు. గురువారం నాడు ఆమె కాకినాడలో కాపుసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 'కాపుసదస్సు'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సమావేశంలో పాల్గొన్నందుకు కక్ష సాధింపు చర్యలుగా తనను సినీరంగంలో ఎవరూ తొక్కేయలేరని వ్యాఖ్యానించారు. సినీ రంగం నుంచి వచ్చిన కొందరు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. నటిహేమ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు గత ఎన్నికలకు ముందు కాపుల రిజర్వేషన్లపై హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాలనే తాము కోరుతున్నామని అన్నారు. 'కాపు'ల న్యాయమైన డిమాండ్‌ను తీర్చడంలో ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తుందని ఆమె ఆరోపించారు. 'ముద్రగడ' చేస్తోన్న ఉద్యమానికి తామంతా సంఘీభావంగా ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు. కాగా ఈ సమావేశంలో చిత్రరంగానికి సంబంధించిన వారు కూడా హాజరయ్యారు. ఖాళీ కంచాలను మోగిస్తూ వారు తమ నిరసనను వ్యక్తం చేశారు.


(302)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ