WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెవిపి'ని బట్టలూడదీసి కొట్టాలట...?

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో అవినీతిలో వాటా పంచుకున్న ఆయన ఆప్తమిత్రుడు కె.వి.పి.రామచంద్రరావును బట్టలూడదీసి కొట్టాలని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ వ్యాఖ్యానించారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, కెవిపి రామచంద్రరావు, వై.ఎస్‌ జగన్‌ కలసి నాడు దోచుకున్న సొమ్ము ఎంతో కెవిపికి తెలుసనని ఆయనను బట్టలూడదీసి కొడితే నిజాలు బయటకు వస్తాయని ఆయన ఘాటుగా విమర్శించారు. వై.ఎస్‌.రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జగన్‌లు పులివెందుల కాలువల్లో రక్తం పారిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా జలాలను పారిస్తున్నారని ఆయన అన్నారు. అవినీతిలో పీకలవరకు మునిగిపోయిన 'జగన్‌' ఇతరుల గురించి వ్యాఖ్యానించే అర్హత లేదన్నారు. తన పార్టీ నుంచి 20మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వెళితే వారు ఎందుకువెళ్లారో కూడా తెలుసుకోలేకపోయిన అజ్ఞాని 'జగన్‌' అని ఆయన విమర్శించారు. 'జగన్‌' ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం రాష్ట్రానికి దురదృష్టకరమని 'జలీల్‌' వ్యాఖ్యానించారు.


(523)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ