WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చిరంజీవి' సినిమాపై 'రామ్‌గోపాల్‌వర్మ' వివాదాస్పద వ్యాఖ్యలు...!

మెగాస్టార్‌ 'చిరంజీవి' 150వ చిత్రం 'ఖైదీనెం.150'పై వివాదాస్పద దర్శకుడు 'రామ్‌గోపాలవర్మ' వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఏదో ఒక వివాదం సృష్టించే 'రామ్‌గోపాలవర్మ' తాజాగా 'చిరు' 150వ సినిమాను తీవ్రంగా విమర్శించారు. అరువు తెచ్చుకున్న కథతో తీసిన ఈ సినిమా వల్ల తెలుగు సినిమా పదేళ్లు వెనుక్కు వెళ్లిపోయిందట. తమిళంలో హిట్‌ అయిన 'కత్తి' రీమేక్‌తో 'చిరంజీవి' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు డిఫరెంట్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో 'రామ్‌గోపాలవర్మ' చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మెగా'జనం' ఇప్పటికైనా వాస్తవాలను అర్థం చేసుకోవాలని లేకపోతే వారు మినీలుగా మిగిలిపోతారని ట్వీట్‌ చేశారు ఆయన. కాగా బాలకృష్ణ వందవ చిత్రం 'గౌతమీపుత్రశాతకర్ణి'పై 'రామ్‌' ప్రశంసలు కురిపించారు. తాను చెప్పిందే నిజమైందని...గౌతమిపుత్ర శాతకర్ణి టీం అంతటికీ శుభాకాంక్షలు. తెలుగు చక్రవర్తి జీవిత గాథను తెరకెక్కించి తెలుగు సినిమా ఖ్యాతిని ఆకాశాన్నంటేలా చేసిన బాలయ్య, క్రిష్‌కు సెల్యూట్‌. తెలుగు ఖ్యాతిని బాహుబలి ప్రపంచానికి చాటి చెప్పడం మొదలుపెడితే.. దాన్ని శాతకర్ణి మరింత ముందుకు తీసుకెళ్లిందని ఆయన ట్వీట్‌ చేశారు. మొత్తం మీద ఒకేసారి విడుదలైన రెండు భారీ చిత్రాల్లో 'బాలయ్య' సినిమా మాత్రమే హిట్‌ అయిందని 'రామ్‌' పరోక్షంగా చెబుతున్నారు.


(143)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ