WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఉగాది'కి వస్తా....!

అందాల సుందరి, తెలుగు టాప్‌ హీరోయిన్‌ 'శృతిహాసన్‌' తెలుగు ప్రేక్షకులకు 'ఉగాది' రోజున షాక్‌ ఇవ్వబోతుందట. గత ఏడాది 'ప్రేమమ్‌' చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను చూరగొన్న బక్కసుందరి..ఇప్పట్లో తన సినిమాలు లేవని 'ఉగాది' నాడు షడ్రుచులతో అలరిస్తానని హామీ ఇస్తోంది. నూతన సంవత్సర తొలి క్వార్టర్స్‌లోనే మూడు సినిమాలతో ప్రేక్షకులను తియ్యటి విందు ఇవ్వబోతోందట. ఇటీవల విడుదల కావాల్సిన ఆమె సినిమా 'ఎస్‌3' వాయిదా పడింది. ఈ సినిమా 'జనవరి' మాసాంతానికి కానీ, లేక ఫిబ్రవరిలో కానీ విడుదల కాబోతోందట. అదే ఊపులో తండ్రీ కూతుళ్లు ఇద్దరూ కలిసి నటించిన 'శభాష్‌నాయుడు' మార్చిలో విడుదల కానుందట. వీరిద్దరు కలసి నటించిన తొలి చిత్రం 'శభాష్‌నాయుడు'. ఇవి కాక గతంలో తనకు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన 'పవన్‌కళ్యాణ్‌'తో 'కాటమరాయుడు' ఉండనే ఉంది. మొత్తం మీద వరుసగా సినిమాలు చేస్తూ...తెలుగులో తనకు ఎదురే లేదని చాటుతోందీ అమ్ముడు...!

(333)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ