WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఇమ్రాన్‌'కి రెండు, గౌరవ్‌కు ఒక ముద్దు పెట్టా...!

ముద్దుల వీరుడు 'ఇమ్రాన్‌ హష్మీ'కి తన అధరాలు రెండుసార్లు అందించిందట హీరోయిన్‌ 'కృతీకర్బంద'. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. 'రాజ్‌ రీబూట్‌' సినిమాతో హిందీలో అరంగ్రేటం చేసిన 'కృతీ' ఈ సినిమా కోసం రెండు సార్లు 'ఇమ్రాన్‌హష్మీ'తో చుంబనసన్నివేశంలో నటించిందట. మొదట 'ఇమ్రాన్‌'తో 'ముద్దు' సన్నివేశం అనగానే భయం వేసిందని తెలిపింది 'కృతీ'. సినిమా షూటింగ్‌ నిమిత్తం రుమేనియా వెళ్లినప్పుడు తనకు ముద్దు సన్నివేశం గురించి చెప్పారట. దాంతో అప్పటి నుంచి ఎగ్జయిట్‌గా ఫీలయిందట. సినిమా షూటింగ్‌ మొదలు అయ్యాక...ఆరో రోజు ఈ సన్నివేశం చేయాల్సి వచ్చిందట. దీంతో ఆ రోజు రాత్రి సరిగా నిద్రపోలేదట. షూటింగ్‌లో అంతా నెర్వస్‌గా అనిపించిందని..అయితే స్క్రీన్‌పై ముద్దు పెట్టుకోవడం పెద్ద విషయం కాదని షూటింగ్‌ అయిన తరువాత తెలిసిందట. దీంతో 'ఇమ్రాన్‌'తో సన్నివేశాలు చాలా సులువుగా జరిగిపోయాయట. 

  ఇదే ఊపులో మరో నటుడు 'గౌరవ్‌ అరోరా'తో కూడా ఒక ముద్దు లాగించిందట ఈ చిన్నది. 'ఇమ్రాన్‌' గురించి చాలా చెప్పారని కానీ...అతను చాలా మంచి వ్యక్తి అని పొగుడుందీమ్మడు. 'గౌరవ్‌'తో సన్నిహితంగా ఉన్నానని వార్తలు వస్తున్నాయని అతను తనకు మంచి ఫ్రెండ్‌ అని అందరూ చెప్పే సోదే మళ్లీ చెబుతోంది. సినిమాల్లో టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని వచ్చానని అయితే ఇక్కడ అంత సులువుగా టాప్‌లోకి వెళ్లలేమని తెలుసుకున్నాని చెబుతోంది. మొత్తం మీద ముద్దులకు, అర్థనగ్న సన్నివేశాలకు, అందాల ఆరబోతలకు ఎగబడితే తొందరలోనే ఆ ఛాన్స్‌ దక్కుతుందులే అంటున్నారు బాలీవుడ్‌ జనాలు..మరి వింటున్నావా...కృతీ...!

(368)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ