WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'కు 'జెసి' మేలు చేస్తున్నారా...?

'వెనకటి ఒకరు ఏదో బొమ్మను చేద్దామనుకుంటే...ఇంకేదో...అయిందట...అఉంది..అనంతపురం ఎంపి జెసి దివాకరెడ్డి ఇటీవల 'జగన్‌'పై చేస్తున్న వ్యాఖ్యలు.ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ గురించి ఇటీవల బహిరంగా పలు తీవ్రమైన విమర్శలు చేస్తున్న జెసి వల్ల టిడిపికి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందన్న అభిప్రాయం స్వంత పార్టీలోనే వ్యక్తం అవుతోంది. ఆయన వ్యాఖ్యల వల్ల 'రెడ్డి' సామాజికవర్గం మొత్తం మళ్లీ సంఘటితం అవుతున్నారు...స్వలాభం కోసం జెసి చేస్తున్న వ్యాఖ్యలు అధికారపార్టీకి చికాకు కల్గిస్తున్నాయి. ఎంపి జెసి దివాకర్‌రెడ్డి ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌పై చేస్తున్న తీవ్ర విమర్శలు, ఉపయోగిస్తున్న పదజాలంపై 'రెడ్డి' సామాజికవర్గంలో తీవ్ర ఆగ్రహ, ఆవేశాలు వ్యక్తం అవుతున్నాయి. 

    ఈ విమర్శల వెనుక సిఎం చంద్రబాబు ప్రోద్బలం ఉందని ఆ సామాజికవర్గ ఓటర్లు నమ్ముతున్నారు. ఇందులో వాస్తవం లేదని, జెసి దివాకర్‌రెడ్డి మనస్వత్తం మిగతా నాయకులకున్నా వేరుగా ఉంటుందని ఆ సామాజికవర్గ ఓటర్లకు, నాయకులకు కూడా తెలుసు. అయినా 'చంద్రబాబు'ను వారు దుమ్మెత్తిపోస్తున్నారు. 'చంద్రబాబు' ముఖ్యమంత్రి అయి రెండున్నరేళ్లు గడిచిన తరువాత కూడా ఆ వర్గ ఓటర్లలలో ఎటువంటి మార్పు రాలేదు. ఇప్పటికీ ఆ సామాజికవర్గ ఓటర్లు ఉన్న గ్రామాల్లో తొంభైశాతం పైగా 'జగన్‌'కు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయం అధినేత 'బాబు'కు తెలుసు. అయినా ఆ వర్గ ఓటర్లు కోసం ఆయన తాపత్రయపడుతున్నారు. వై.ఎస్‌.జగన్‌ క్రైస్తవ మతస్తుడని ఆ వర్గ ఓటర్లకు తెలియదా...? మతం వేరు...కులం వేరు..అన్న విధంగా వారు భావిస్తున్నారు. ఆ సామాజికవర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు 'జగన్‌' పార్టీని వీడి టిడిపిలో చేరినా కేవలం వారి కుటుంబ సభ్యులు మినహా ఇతరుల మనసు మార్చలేకపోయారు. ఈ విషయం టిడిపి నాయకులు పదే పదే 'చంద్రబాబు'కు చెబుతున్నా ఆయన చెవికెక్కించుకోవడంలేదు. ఏదో విధంగా ఆ వర్గ ఓటర్లలో చీలిక తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. వారిలో మార్పు రాలేదు..మార్పు వస్తుందన్న నమ్మకం లేదని, జెసి దివాకర్‌రెడ్డి వంటి నాయకులు చెబుతున్నా కూడా ఫలితం కనిపించడం లేదని...ఇంకా వారి మద్దతు కోసమే 'బాబు' ప్రాకులాడుతున్నారు. 

    కడప జిల్లా 'జమ్మలమడుగు' నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య పూడ్చలేనంత విభేదాలు ఉన్నాయి. 'జగన్‌' పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన 'ఆదినారాయణరెడ్డి' టిడిపిలో చేరినా ఆయన సామాజికవర్గ ఓటర్లు మాత్రం 'జగన్‌'కే మద్దతు ఇస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే అంగీకరించారు. ఇటీవల జెసి దివాకర్‌రెడ్డి ఆఫ్‌ ది రికార్డుగా మాట్లాడుతూ 'పదేళ్లు అధికారాన్ని శాసించాం...మన కులపోళ్లే...ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగారు..ఇతర వర్గాలను కలుపుకుపోవడంలో అహంకారంతో వ్యవహరించి విఫలమయ్యాం...ఇప్పుడు మళ్లీ 'జగన్‌' పార్టీ వైపు మూకుమ్మడిగా వెళ్లి ఇతర వర్గాల్లో వ్యతిరేకత పెంచారు...దీంతో 'బాబు' అధికారంలోకి రాగలిగారు. స్థానిక టిడిపి నాయకులతో పరోక్షంగా కుమ్మక్కై అధికారికంగా, ఆర్థికపరంగా ఆ వర్గ నాయకులు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో అధికారం చెలాయిస్తూనే ఉన్నారు. దీంతో ఇతర వర్గాలలో ఆలోచన ప్రారంభమైంది. ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలు సిఎం చంద్రబాబును కలసి 'సార్‌..ఉన్న ఓటర్లును పోగొట్టుకుంటున్నాం..రాని ఓటర్లను బతిమిలాడుతున్నాం..దీంతో మన ఓటర్లలో కూడా అసంతృప్తి కనిపిస్తుంది..మనవారికి నొప్పి తగలకుండా..విపక్షాల ఓటర్లను ఆకర్షించే మార్గాలు వెతకండి...అంతే కానీ...'జగన్‌'పార్టీ నాయకులను పార్టీలో చేర్చుకోవద్దని చెప్పారట'. దీనిపై ఆయన స్పందించ లేదట. ఇప్పటికీ 'రెడ్డి'సామాజికవర్గ ఓటర్లు 'జగన్‌'కే మద్దతు ఇస్తున్నారనే విషయం టిడిపిలోని 'రెడ్డే'తర నాయకులందరికీ తెలుసు.

   'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రిని 'జనంప్రత్యేక ప్రతినిధి'స్వయంగా కలసి ఈ విషయంపై స్పందించమని కోరగా...'ఎన్నికల ముందు పరిస్థితి ఎలా ఉందో...ఇప్పటికీ మా వర్గ ఓటర్ల పరిస్థితి అంతే ఉంది. నాయకులు పార్టీ మారుతున్నా...ఓటర్లు మాత్రం 'జగన్‌' వైపే చూస్తున్నారు. అతి కొద్దిమాత్రమే పార్టీ మారిన నాయకులతో కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు'.ఇదే విషయంపై బిసి వర్గానికి చెందిన ఎమ్మెల్సీ స్పందనను కోరగా అదే సమాధానం చెప్పారు. మీ ఓటర్లలలో మార్పు వచ్చిందా...? అని ప్రశ్నించగా కొంత 'జగన్‌' వైపు మళ్లుతున్నట్లు అనిపిస్తోంది...కానీ..'జగన్‌' ఓటర్లు ఆయన వైపే స్థిరంగా ఉన్నారని, వారిలో కనీసం 10శాతం కూడా టిడిపి వైపు రావడం లేదని చెప్పారు. ఇంత మంది చెబుతున్నా...వివిధ వర్గాల నుండి నివేదికలు అందుతున్నా 'చంద్రబాబు' ఆ వర్గ ఓటర్ల మద్దతు కోసం పాకులాడుతూనే ఉన్నారు.

(714)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ