WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'విశాఖ'లో 'ఖైదీనెం.150' విజయోత్సవ సభ...!

చాలా రోజుల తరువాత తెలుగు సినీపరిశ్రమ మళ్లీ పాత రోజులను గుర్తు చేసుకుంటుంది. ఇంతకు ముందు ఒక సినిమా 50 రోజులు ఆడితే అర్థశతదినోత్సవం అని...100 రోజులు ఆడితే శతదినోత్సవం అంటూ విజయోత్సవ సంబరాలు భారీగా నిర్వహించేవారు. ఇటీవల కాలంలో అటువంటి విజయోత్సవాలు ఎక్కడా నిర్వహించడంలేదు. ఎంత భారీ బ్లాక్‌బస్టర్‌ సినిమా అయినా ఎంత కలెక్షన్స్‌ వచ్చాయి...ఎన్ని రికార్డులు సృష్టించాయి..అనే అంశాలపైనే ఎక్కువగా స్పందిస్తున్నారు తప్ప...విజయోత్సవాలను నిర్వహించడంలేదు. అయితే పాత సాంప్రదాయాలను మళ్లీ మెగాస్టార్‌ 'చిరంజీవి' తనతోనే మళ్లీ మొదలుపెట్టబోతున్నారు. సంక్రాంతి విడుదల అయిన ఆయన సినిమా 'ఖైదీనెం150' విజయోత్సవ సంబరాలను నిర్వహించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారట. దీన్ని విశాఖపట్నంలో నిర్వంచాలా...? లేక హైదరాబాద్‌లో నిర్వహించాలా? అనే అంశంపై తన సన్నిహితులతో ఆయన చర్చిస్తున్నారట. 

  ఈ సినిమా విడుదలకు ముందు గుంటూరులో ప్రీ సక్సెస్ మీట్ చేసారు. గతంలో మెగా సినిమాలు కొన్నింటికి విశాఖలో విజయోత్సవ సభలు జరిపారు. ఇప్పుడు మళ్లీ అలాగే అక్కడే విజయోత్సవ సభ జరపాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మెగా శిబిరానికి ఆప్తుడయిన మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ వున్నారు. ఆయనే ఈ విషయంలో ప్రోత్సహిస్తున్నట్లు బోగట్టా. గుంటూరు సభకు గంటా రాలేదు. అప్పట్లో సభకు అనుమతి ఇవ్వకపోవడం, వంటి వ్యవహారాలు వుండడంతో గంటా దూరంగా వున్నారు.ఇప్పుడు విశాఖలో సభ అంటే గంటా పాల్గొనడంలో అనౌచిత్యం ఏమీ వుండదు. ఎందుకంటే ఆయన అక్కడ మంత్రి, ఎమ్మెల్యేగా వున్నారు కాబట్టి. అదీ కాక విశాఖలో కొత్త రికార్డులు సృష్టించే దిశగా ఖైదీ పయనిస్తోంది. ఇప్పటికి ఎనిమిది కోట్ల వరకు షేర్ వచ్చింది. ఇప్పుడు అక్కడ సభ జరిపితే, మరింత ముందుకు సాగి, పది కోట్ల మార్కును దాటే అవకాశం వుంది. ఇది ఉత్తరాంధ్ర కే కొత్త రికార్డు అవుతుంది. అందుకే విశాఖలోనే సభ జరిపే అవకాశం వుంది.

(275)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ