WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ముందు నన్ను అరెస్టు చేయండి...!

ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న యువతపై ప్రభుత్వ పగపట్టిందని, అందుకే శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తుందని ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం గురువారం విశాఖ బీచ్‌లో తలపెట్టిన కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనకు తానే స్వయంగా వెళ్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రకటించారు. తాము శాంతియుతంగానే నిరసన తెలుపుతామన్నారు. చంద్రబాబు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ర్యాలీకి వస్తే అరెస్ట్‌లు చేస్తామంటూ బెదరించడం ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు. తాను నేరుగా విశాఖ వెళ్తానని అరెస్ట్‌ చేస్తే చేసుకోవచ్చన్నారు.శాంతియుత నిరసనకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అరెస్ట్‌ చేస్తే అది చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తామన్నారు. హోదా కోసం పోరాటం చేస్తే విద్యార్థులపై పీడీ యాక్ట్‌ పెడుతామంటున్న చంద్రబాబునే ముందుగా బొక్కలో వేయాలన్నారు. జూన్‌లో జరిగే పార్లమెంట్‌ సమావేశాల అనంతరం హోదా కోసం వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని జగన్‌ ప్రకటించారు. హోదా అంశాన్ని దేశం మొత్తం చూసేలా ఎన్నికలకు వెళ్తామన్నారు. తన కేసులకు భయపడి చంద్రబాబు కేంద్రానికి హోదాను తాకట్టు పెట్టారన్నారు జగన్‌.

(155)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ