WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రెండేళ్లలో 'సిఎం'ను అవుతా....!

'రెండేళ్లలో సిఎంను అవుతా...మీ అందరి పేర్లు గుర్తుపెట్టుకున్నా...మీ సంగతి తేలుస్తా...? అంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం యువత నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చిన ఆయనను పోలీసులు ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆగ్రహానికి గురి అయ్యారు. 'మీరు మమ్మలేం చేయాలనుకుంటున్నారు... అసలు మీరంతా ఎవరు...? నన్నేం చేద్దామనుకుంటున్నారు...? మీ ఐడి కార్డులు చూపించండి...! అంటూ ఆయన పోలీసులపై ఫైర్‌ అయ్యారు.  ఒక ప్యాసింజర్‌గా కూడా డొమెస్టిక్‌ అరైవల్‌లోనికి వెళ్లనివ్వరా.. మమ్మల్ని ఏం చేయాలని ఉన్నారిక్కడ చెప్పండి అంటూ పోలీసులను గట్టి స్వరంతో జగన్‌ ప్రశ్నించారు. అనంతరం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి జగన్‌ రన్‌వే పై బైఠాయించారు. వుయ్‌ వాంట్‌ స్పెషల్‌ స్టేటస్‌ అంటూ ఎయిర్‌పోర్టులో నినాదాలతో హోరెత్తించారు.


(271)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ