WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'గీతారాణి, శివనారాయణ'లకు ప్రతిభాపురస్కారాలు...!

గ్రామీణాభివృద్ధి శాఖలో నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేసిన ఇద్దరు ఎంపిడిఒలకు ప్రతిభాపురస్కార అవార్డులు దక్కాయి. వీరిలో ఒకరు 'గీతారాణి' మరొకరు 'శివనారాయణ'. 'గీతారాణి' 'పెదకూరపాడు'లో బాధ్యలు నిర్వహిస్తుండగా, శివనారాయణ బాపట్లలో విధులునిర్వహిస్తున్నారు. వీరిద్దరికీ సర్వీసులో ఎటువంటి అవినీతి మచ్చలు అంటలేదు. సామాన్య ప్రజలకు చేరువుగా వారు ఉంటారు. కుల,మతాలకు, రాజకీయపార్టీలకు అతీతంగా బాధ్యలు నిర్వహిస్తున్నారని పేరు తెచ్చుకున్నారు. వీరి సేవలను మెచ్చుకున్న ప్రభుత్వం వీరికి ప్రతిభాపురస్కారంతో సత్కరించింది. రిపబ్లిక్‌డే సందర్భంగా వారికి గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. మిగతా ఎంపిడిఓలు కూడా వీరి వలే నిజాయితీగా, సమర్థవంతంగాపనిచేయాలని(ఇప్పుడు పనిచేయడం లేదని నా అభిప్రాయం కాదు) మరింత ఎక్కువగా పనిచేసి అవార్డులు అందుకోవాలని ఆయన కోరారు. బాపట్ల ఎంపిడిఓగా పనిచేస్తున్న 'శివనారాయణ' గ్రూప్‌-1 ద్వారా ఎంపికయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా 'ఉంగుటూరు, ఖమ్మం జిల్లాలో పనిచేశారు. గిరిజన వర్గాలకు అనేక సౌకర్యాలు కల్పించడంలో ఎనలేని కృషి చేశారు. గతంలో ఆయనకు స్వాతంత్య్రదినోత్సవ సందర్భంగా అవార్డును అందుకున్నారు. ఎంజి, ఎన్‌ఆర్‌జిఎస్‌ పథకాల అమలు చేయడంలో చూపిన పనితీరుకు మెచ్చి ప్రభుత్వం అవార్డును ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా బడుగు వర్గాలకు ఎనలేని సేవచేశారు. 2016లో రిపబ్లిక్‌డే అవార్డును కూడా ఆయన అందుకున్నారు. 2017లో కూడా పైపథకం అమలులో ఆయన చేసిన కృషికి అవార్డు దక్కింది. పెదకూరపాడు ఎంపిడిఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'కావూరి గీతారాణి' చేసిన సేవలు, కృషికి ఆమెకు ప్రతిభాపురస్కారం దక్కింది. కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే ఆమెకు ఈ రోజు అవార్డును అందజేశారు. గతంలో ఆమె 'డ్వామా'లో ఎడ్మినిస్ట్రేషన్‌ అధికారిగా తరువాత 'సెర్ఫ్‌'లో ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు నిర్వహించారు. అవినీతి మచ్చలేని మహిళా అధికారుల్లో ఆమె ఒకరు. మిగతా అధికారుల కన్నా 'గీతారాణి' కష్టపడి పనిచేశారని 'కలెక్టర్‌' ప్రశంసించారు.


(388)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ