WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆ దర్శకుడు డ్రగ్స్‌ తీసుకుంటాడు'...!

ఈ రోజుల్లో సినిమా పరిశ్రమలో మందు,మగువ, డ్రగ్స్‌ ఇవన్నీ చాలా సహజమైపోయాయి. మందు, మగువలను కొంత మంది అంగీకరిస్తున్నా...డ్రగ్స్‌ అంటే ఇక శృతి మించిపోతున్నట్లే. బాలీవుడ్‌లో డ్రగ్స్‌ ఇప్పుడు కామన్‌ అయిపోయాయి. అదే సంస్కృతి ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో వర్థిల్లుతోందట. ఈ విషయం ఎవరో చెప్పడం లేదు. నిర్మాత బండ్ల గణేష్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను నిర్మించిన చిత్రానికి దర్శకత్వం వహించిన ఒక దర్శకుడు రోజూ డ్రగ్స్‌ తీసుకుంటారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆయనతో ఓ చిత్రాన్ని నిర్మించానని ఆయనంటే తనకు అహస్యమని, అతను రాత్రి అయితే మందు, డ్రగ్స్‌తో ఊరేగుతుంటాడని ఆయన చెప్పారు. అతనికి సినిమా అంటే గౌరవం లేదని, అతనితో ఎందుకు పనిచేశానని ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నానని అన్నారు. 

  తనకు చెప్పిన మాటల వల్ల ఎన్టీఆర్‌ను అపార్థం చేసుకున్నానని, ఎన్టీఆర్‌తో గతంలో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటానని, త్వరలో ఆయనను కలుస్తానని 'బండ్ల' చెప్పారు. ఎన్టీఆర్‌తో తీసిన 'బాద్‌షా' తనకు నష్టాలు తెచ్చిపెట్టిందని, తరువాత ఆయనతో తీసిన 'టెంపర్‌' లాభాలను తెచ్చిందని చెప్పారు. సినీ పరిశ్రమలో బాయ్‌గా ప్రవేశించి పెద్ద నిర్మాతగా మారిన 'గణేష్‌' ఒకప్పుడు అడల్డ్‌ సినిమా 'ఫ్లీజ్‌ ఆంటీ'లో నటించారు. తన స్టామినా ఎవరికీ తెలియదని, తాను అనుకుంటే ఇప్పటికిప్పుడు అమెరికా అధ్యక్షుడు 'ట్రంప్‌'తో ఫొటో దిగగలని ఆయన చెప్పుకున్నారు. మొత్తం మీద చాలా రోజుల తరువాత 'బండ్ల గణేష్‌' వార్తల్లోని వ్యక్తి అయ్యారు.


(256)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ