WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎన్టీఆర్‌ సరసన 'అనుపమ'...!

వరుసగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించి ఊపుమీద ఉన్న 'అనుపమ పరమేశ్వరన్‌' ఇప్పుడో క్రేజీ ఛాన్స్‌ దక్కించుకుంది. 'అఆ', 'ప్రేమమ్‌', 'శతమానంభవతి'లతో తెలుగుసినీ పరిశ్రమను ఊపేస్తున్న 'అనుపమ' సుకుమార్‌-చెర్రీ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే ఈ అమ్మడు పెట్టిన కండిషన్లు, ఇతర అంశాలను చూసి షాక్‌ తిన్న దర్శకుడు 'సుకుమార్‌' ఆమెను ఆ సినిమా నుంచి తప్పించారట. ఈ విషయంపై ఆమె వరుసగా ట్విట్‌లు చేసింది. నన్ను పక్కకు పెట్టినా నాకు పోయేదేమీ లేదు..ఇంతకన్నా మంచి అవకాశాలు దక్కించుకుంటానని ఛాలెంజ్‌ చేసింది. అన్నట్లుగా ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా 'జైలవకుశ' సినిమాలో ఒక హీరోయిన్‌గా ఎంపికైందట. ఎన్టీఆర్‌ సరసన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. దానిలో ఒక హీరోయిన్‌గా ఆమె ఛాన్స్‌ దక్కించుకుంది. మొత్తం మీద ఛాలెంజ్‌ను 'అనుపమ' నిలబెట్టుకుందని ఆమె సన్నిహితులంటున్నారు. గట్టిపిండమే...మరి...!


(210)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ