WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అమ్మాయిల బ్రోకరు...బండ్లగణేష్‌'...!

సినీ నిర్మాత 'బండ్ల గణేష్‌' అమ్మాయిలను సరఫరా చేసే బ్రోకరు అని సినీతార 'మీరాచోప్రా' సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ట్విట్టర్‌ ఎకౌంట్‌లో ఆమె ఈ వ్యాఖ్యలను చేసింది. 'బండ్ల గణేష్‌' చేయని పనిలేదు..అమ్మాయిలను తార్చడం దగ్గర నుంచి అన్ని పనులు చేశాడని ట్విట్‌ చేసింది. దీంతో సోషల్‌ మీడియాలో ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దాంతో ఆ వ్యాఖ్యలను తన ఎకౌంట్‌ నుంచి తీసేసింది. ఇటీవల 'సచిన్‌జోషి' ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'బండ్ల' 'అమ్మాయిల బ్రోకర్‌' అని వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు అతని సంగతి బయటపెడతానని 'జోషి' వ్యాఖ్యానించాడు. ఇప్పుడు 'మీరాచోప్రా' ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. కమెడియన్‌గా సినీ ప్రస్తానం ప్రారంభించిన 'బండ్ల గణేష్‌' తరువాత బడా నిర్మాతగా మారిపోయారు. పలువురు అగ్రహీరోలతో సినిమాలు నిర్మించారు. తాను రాజకీయ నాయకులకు చాలా సన్నిహితుడనని, తనను ఏవరూ ఏమీ చేయలేరని ఆయన ఇటీవల కాలంలో వ్యాఖ్యానించారు. వైకాపా సీనియర్‌ నేత 'బొత్స సత్యనారాయణ' తనకు చాలా సన్నిహితుడని, తాను హత్యలు చేసినా...తనను 'బొత్స' కాపాడతారని అప్పుడెప్పుడో 'గణేష్‌' వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. తాజాగా తాను తలచుకుంటే వారం రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫొటో దిగుతానని చెప్పుకున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు హీరోయిన్‌ చేసిన వ్యాఖ్యలతో 'బండ్ల' పరువు గంగలో కలసినట్లేనని సినీ వర్గాలు అంటున్నాయి. మరి 'బండ్లగణేష్‌' ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

(357)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ