డబుల్‌హ్యాట్రిక్‌ కొట్టిన 'నాని'...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

డబుల్‌హ్యాట్రిక్‌ కొట్టిన 'నాని'...!

యువ హీరోలలో 'నాని'ది ప్రత్యేక ఒరవడి. అతను పాత్రలను ఎంచుకునే తీరే అతనికి విజయాలు సాధించిపెడుతుంది. ఆ కోవలో వరుసగా ఆరవ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు 'నాని'. ఎవడే సుబ్రమణ్యం నుండి మజ్ను వరకు ఐదు సినిమాలు హిట్స్‌ కొట్టాడు. సెకండ్‌ హ్యాట్రిక్‌ కొట్టడానికి నాని చేసిన ప్రయత్నమే  నేను లోకల్‌  అలాగే నిర్మాతగా వరుస విజయాలను సాధిస్తున్న దిల్‌రాజు, సినిమా చూపిస్త మావతో సక్సెస్‌ సాధించిన త్రినాథరావు నక్కిన దర్శకత్వం..ఇలా అందరూ సక్సెస్‌ ఫుల్‌ వ్యక్తులు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాయే 'నేను లోకల్‌' నాని, దిల్‌రాజు కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.  

కథ:

ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ బాబు(నాని) ఎలాగెలాగో కష్టపడి కాపీ కొట్టి ఇంజనీరింగ్‌ పాస్‌ అవుతాడు. ఓ సందర్భంలో కీర్తి(కీర్తిసురేష్‌)తో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తన ప్రేమను ఆమెకు చెబుతాడు. అయితే కీర్తి మాత్రం ముందు బాబు ప్రేమను లైట్‌ తీసుకుంటుంది. కీర్తి తండ్రి లెక్చరర్‌, తనకు డీసెంట్‌గా ఉండే అబ్బాయిలంటే బాగా ఇష్టం. అలాంటి వ్యక్తికి బాబు ప్రవర్తన నచ్చదు. అందుకోసం తను చెప్పిన అబ్బాయినే పెళ్ళి చేసుకోవాలని కీర్తితో అంటుంటాడు. ఈలోపు బాబు, కీర్తిని ప్రేమలో పడేలా చేసుకుంటాడు. కీర్తి తండ్రి ఆమెకు సిద్ధార్థ్‌(నవీన్‌చంద్ర)తో సంబంధం కుదురుస్తాడు. సిద్ధార్థ్‌ ..కీర్తిని ప్రేమించి ఆమె కోసం పోలీస్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. మరి అప్పుడు కీర్తి ఏం చేస్తుంది? తండ్రి మాటకు గౌరవం ఇచ్చి సిద్ధార్థ్‌ను పెళ్ళి చేసుకుంటుందా? లేక బాబును పెళ్ళి చేసుకుంటుందా? అని తెలియాలంటే సినిమా చూడాల్సిందేనేచురల్‌ స్టార్‌ నాని..మరోసారి తన నేచురల్‌ పెర్‌పార్మెన్స్‌ను ప్రదర్శించాడు. చాలా ఈజ్‌తో చేసిన నాని నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. లోకల్‌ కుర్రాడిగా అమ్మాయిని వెంబడించడం, అమ్మాయి ప్రేమ కోసం రౌడీలతో గొడవ పడటం. లెక్చరర్స్‌ స్టూడెంట్‌ మధ్య ఉండే రిలేషన్స్‌తనదైన స్టయిల్‌ నాని చేసిన అభినయం, ఆడియెన్స్‌ను అలరిస్తుంది. అలాగే డ్యాన్సులు, ఫైట్స్‌తో కూడా నాని మెప్పించాడు. కీర్తి సురేష్‌ లుక్స్‌పరంగా చూడటానికి బావుంది. తన పాత్రకు న్యాయం చేసింది. కీర్తి సురేష్‌ తండ్రి పాత్రలో ప్రవీణ్‌ కేడ్‌కర్‌ మంచి నటనను కనపరిచాడు. తండ్రి పాత్రల్లో ఇకపై పవ్రీణ్‌ కేడ్‌కర్‌కు క్యూ కడుతాయని చెప్పవచ్చు. పోసాని, ఈశ్వరీరావుల కామెడీ మిక్స్‌ చేసిన పాత్రలు మెప్పిస్తాయి. హీరో నవీన్‌చంద్ర పెద్ద ప్రాముఖ్యత లేని పాత్రలో కనపడ్డాడు. నటనపరంగా తన పాత్రకు తను వంద శాతం న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులందరూ వారి వారి పాత్రల్లో మమ అనిపించారు.ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే దర్శకుడు త్రినాథరావు..చెప్పాలనుకున్న పాయింట్‌ పాతదే అయినా కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. నేను లోకల్‌ అనే క్యారెక్టర్‌ను ఆల్రెడి ఇడియట్‌లో రవితేజ చేసేశాడు. తనలా మరెవరూ చేయలేరు. కానీ అలాంటి పాత్రను మరొకటి డిజైన్‌ చేసి దాని చుట్టూ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమాను ముడిపెట్టిన తీరు చూస్తే దర్శకుడిని అభినందించక తప్పదు. దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు చాలా బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం పరవాలేదంతే. నిజార్‌ షఫీ సినిమాటోగ్రఫీ బావుంది. సాయికృష్ణ, ప్రసన్నకుమార్‌లు రచన సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. మంచి డైలాగ్స్‌ను రాయించారు.''నేను నీ పెళ్ళి చేసిన తర్వాత నిన్ను సాగనంపేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవాలే కానీ..పెళ్ళి చేయడానికి కన్నీళ్ళు పెట్టుకోకూడదు'' ఇలా సిచ్చువేషన్స్‌కు అనుగుణంగా ఉన్న డైలాగ్స్‌ను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. సినిమా నిడివి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలే అయినా, ఏదో పెద్ద సినిమాను చూసేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. లవర్‌కు తెలియకుండా హీరో కార్పొరేటర్‌ ఎలా అవుతాడో తెలియదు..ఇలా లాజిక్‌ మిస్‌ అయ్యింది.  

(307)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ