WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'విజ్డన్‌' కవర్‌ పేజీపై 'విరాట్‌'...!

ప్రపంచ నెంబర్‌ వన్‌ క్రికెటర్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంగ్లండ్‌లో ప్రచురితమయ్యే ప్రముఖ మ్యాగజైన్‌ 'విజ్డన్‌' 2017కు గాను తన కవర్‌ పేజ్‌పై 'కోహ్లీ' ఫోటోను ప్రచురించింది. ఈ ఘనత సాధించడం ఆషామాషీ కాదు. దిగ్గజ ఆటగాళ్లకు సైతం ఈ గౌరవం ఇంతకు ముందు దక్కలేదు. భారత్‌ తరపున క్రికెట్‌ దేవుడు 'సచిన్‌ టెండూల్కర్‌' మాత్రమే ఈ ఘనత సాధించారు. 2014లో ఆయన క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినప్పుడు 'విజ్డన్‌' తన మ్యాగజైన్‌లో 'సచిన్‌' చిత్రాన్ని ముద్రించింది. భారత్‌ తరుపున ఎన్నో ఘనతలు సాధించిన 'రాహుల్‌ ద్రావిడ్‌, గవాస్కర్‌, కపిల్‌దేవ్‌, లక్ష్మణ్‌, గంగూలి, కుంబ్లేలు వంటి ఆటగాళ్లకు సైతం ఇటువంటి అవకాశం రాలేదు. గత ఏడాది 'కోహ్లీ' సాధించిన పరుగులే ఇప్పుడు ఆయన చిత్రాన్ని ఆ పత్రిక ప్రచురించడానికి కారణమైంది. 

  2016 సంవత్సరంలో 'కోహ్లీ 25 వన్డే సెంచరీలను సాధించి...వన్డేల్లో వేగవంతగా 25 సెంచరీలు సాధించిన రికార్డు తిరగరాశాడు. అదే విధంగా వన్డేల్లో 7500 పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. ఛేజింగ్‌లో 14 సెంచరీలు సాధించి జట్టును గెలిపించాడు. ఐపిఎల్‌ సింగిల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టెస్టుల్లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా 'కోహ్లీ' రికార్డులు సృష్టించాడు. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి పరుగులు చేయడం ఆయన ఘనతల్లో కొన్ని. కాగా 'విజ్డన్‌' కవర్‌పేజీపై 'కోహ్లీ' చిత్రాన్ని ముద్రించడంపై ఆ పత్రిక ఎడిటర్‌ లారెన్స్‌ స్పందిస్తూ 'కోహ్లీ ఒక ఆధునిక క్రికెటర్‌ అని, అతనికి గుర్తింపు ఇవ్వడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. తనకు పోటీగా నిలిచిన ఏబీ డెవీలియర్స్‌, విలియమ్సన్‌, రూట్‌, స్టీవ్‌ స్మిత్‌లను 'కోహ్లీ' తేలికగా అధిగమించాడని ఆయన చెప్పారు.


(198)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ