WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఉగాదినాటికి గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తిచేయండి

గుంటూరు :రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టీన ఎన్టీఆర్  గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తిచేసి ఉగాదినాటికి నూతనగృహలల్లో లబ్దిదారులు ప్రవేశం చేసేలా  ఆ దిశగా అధికారులు సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని సూచించారు.మంగళవారం స్థానిక గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలోకలెక్టర్ కాంతిలాల్ దండే గారితో కలిసి గృహనిర్మాణశాఖ అధికారులు, ఉపాధి హామీ పథకం అధికారులతో కలిసి గృహనిర్మాణ , గ్రామీణాభివృద్ది మరియు పారిశుద్యశాఖ మంత్రి డా.కిమిడి మృణాళిని సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి, పారిశుద్ధ్యంపై తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మృణాళిని మాట్లాడుతూ జిల్లాకు 18400  ఎన్టీఆర్‌ గ్రామీణ పధకం క్రింద, ఎన్టీఆర్‌ గ్రామీణ పధకం-గ్రామీణ (పీఎంఎవైలో) 5,238 గృహాలు మరియు 11808 గృహాలు పట్టణ గృహనిర్మాణ (వ్యక్తిగత గౄహాలు ) పధకం క్రింద  మంజూరయ్యాయని వివరించారు. ఇలా రూ.794 కోట్లతో జిల్లాలో 35 వేల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. అలాగే జిల్లాలో ఎన్టీఆర్ నవీకరణ పధకం క్రింద 11వేల గృహాలమరమత్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ గృహనిర్మాణాలు మార్చిలోగా పూర్తికావటానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లబ్దిదారుల ఎంపిక  పారదర్శకంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రతీ దశలోను ఇళ్లకు జియోట్యాగింగ్‌ చేయాలని సూచించారు.

ISHDP(ఇంటిగ్రెటెడ్ హౌసింగ్ అండ్ సల్లమ్ డెవలప్ ప్రోగ్రామ్) పధకం క్రింద 2432 గౄహములను అడవితక్కెళ్ళపాడు మరియు చౌడవరము లేఅవుట్లనందు 46.24 కోట్ల ఖర్చుతో గౄహాలు నిర్మించి 9.94 కోట్లు ఖర్చుతో మౌళిక సదుపాయాలతో పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టలను రాబోయే 10 రోజులలో ప్రారంభించబడి తదుపరి పిబ్రవరి మాసాంతమునకు లబ్దిదారులందరికీ గృహలు అందచేస్తామని మంత్రి మృణాళిని తెలిపారు.


3.5 లక్షల కొత్తపించన్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు నియోజకవర్గానికి రెండువేల కొత్తపించన్లు కేటాయించామన్నారు. సభాపతి కోడెల శివప్రసాద్ గారి స్పూర్తితో జిల్లాలో మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ఉత్సాహంగా ముందుకువస్తున్నారని, అనుకున్న లక్ష్యాలను సాదించడానికి కృషి చేస్తామన్నారు.వెంటనే మరుగుదొడ్ల బిల్లులను మంజూరు చేయాలన్నారు.  జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పించన్లు క్రింద ప్రతినెలా 390751 మంది పించన్లుఅందిస్తున్నామని వీరికి నెలకు రూ.42.36 కోట్లు రూపాయలు పించన్లు పంపిణీచేయడం జరుతున్నదని మంత్రి తెలిపారు. జిల్లాలో 2016-17 యస్.హెచ్.జి బ్యాంకు లింకేజి లక్ష్యం డిశంబర్ 2016 వరకు రూ.30,531 కోట్లరూపాయల రుణాలు మంజూరు చేశామని ఈ సమావేశంలో మంత్రి డా.కిమిడి మృణాళిని తెలిపారు. అలాగే డ్వాక్రా మూల పెట్టుబడి నిధి క్రింద జిల్లాలో 60,800 సహయసంఘాలకు రూ.586 కోట్ల రూపాయలు గాను రూ.6 వేల రూపాయలు చొప్పున మెదటి,రెండవ విడత రూ.341.80 కోట్లరూపాయలు చేశామని దీంతో పాటూ రూ.125.14 కోట్ల రూపాయలు వడ్డీ రాయితీ ని మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ప్రజాసాధికార సర్వేలో ఇఫ్ఫటివరకు 41,81,147 మందికి సర్వే పూర్తికాగా వారిలో 18,82,503 మంది చంద్రన్నభీమాలో నమోదు చేసి రాష్ట్రంలో 2వస్థానంలో ఉందని తెలిపారు. డిజిటల్ లిటరసీ ద్వారా3,94,800 స్వయం సహాయసంఘల సభ్యులకు మొబైల్ ద్వారా ఇంటర్‍నెట్ 86,069 మందికి సంబందించి శిక్షణ ఇవ్వడం జరిగిండని రాష్ట్రంలో మెదటి స్థానంలో ఉన్నామని మంత్రి అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి రావెల కిషోర్ బాబు,ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జడ్పీచైర్మన్ జానీమూన్, హొసింగ్ పీడి నాగశివరావు,డిఆర్.డిఎ హబీబ్ భాషా తదిర ఉన్నాధికారులు పాల్గొన్నారు.

(249)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ