WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నేను సిఎం కావాలని ఎందుకు అనుకుంటున్నానంటే....!

    ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌మోహ్మన్‌రెడ్డి తన సిఎం కలలను మరోసారి వ్యక్తం చేశాడు. తనకు ఆ పదవిపై ఉన్న వ్యామోహాన్ని విద్యార్థుల సాక్షిగా బయటపెట్టుకున్నారు. తాను ఆ పదవిని ఎందుకు కోరుకుంటున్నాడో వివరించి విద్యార్థులకు చెప్పారు. విద్యార్థులు తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. గురువారం నాడు గుంటూరులో నిర్వహించిన 'యువభేరి' కార్యక్రమంలో ఆయనేమన్నారో...ఆయన మాటల్లోనే....!తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడానికి ఓ కార‌ణం ఉందని అన్నారు.. ‘ఆ కోరిక‌కు అర్థం ఏంటో తెలుసా? నేను చ‌నిపోయిన త‌రువాత ప్ర‌తి ఇంట్లో నాన్న (వైఎస్‌ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి) ఫొటోతో పాటు నా ఫొటో కూడా ఉండాల‌న్నది నా త‌ప‌నా తాప‌త్ర‌యం. దాన్ని సాధించేందుకు ఆరాట‌ప‌డ‌తాను’ అని వైఎస్ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. తాను కూడా త‌న తండ్రిలా ప్ర‌తి ఒక్క‌రి తోడు ఉంటాన‌ని భ‌రోసా ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు.గురువారం గుంటూరులోని నల్లపాడులో నిర్వహించిన 'యువభేరి' కార్యక్రమంలో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ...చంద్ర‌బాబు నాయుడి మాదిరిగా త‌న ఆలోచ‌న‌లు డ‌బ్బుపై ఉండ‌వ‌ని అన్నారు. చంద్ర‌బాబు నాయుడు క‌మీష‌న్ల‌కు ఆశ‌ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. రాదు అనుకున్న తెలంగాణను అక్క‌డి ప్ర‌జ‌లు సాధించుకున్నప్పుడు పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని ఎందుకు సాధించుకోలేమ‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. వైసీపీ ఎంపీలంద‌రూ ఆగ‌స్టు త‌రువాత రాజీనామా చేస్తారని, దేశం మొత్తానికి మ‌న బాధ‌ను తెలియ‌జేస్తారని ఆయ‌న అన్నారు. హోదా ఇవ్వ‌క‌పోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఊరుకోరు అని తెలియ‌జేస్తామ‌ని చెప్పారు.
     చంద్ర‌బాబు నాయుడు ఒకే అబ‌ద్ధాన్ని వంద‌సార్లు ప్ర‌చారం చేస్తున్నారని జగన్ అన్నారు. ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయ‌ని చెప్పిందే చెబుతున్నారని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు బంగాళాఖాతంలో క‌లిపేస్తార‌ని ఆయ‌న అన్నారు.తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్న బాధతో ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని, తెలుగు వాళ్ల ప్రయోజనాలను ఢిల్లీ వాళ్ల కాళ్ల మీద పారేస్తే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుందేమో అనిపిస్తోందని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.‘అందరి చేతుల్లో ఇప్పుడు 3జీ, 4 జీ మొబైల్ ఫోన్లు ఉన్నాయి. మీ త‌ల్లిదండ్రుల‌ను అడ‌గండి, న‌ల‌భై ఏళ్ల కింద‌ట వారి వ‌ద్ద క‌నీసం గ్రామ్ ఫోన్లు కూడా లేవు. ఇంట్లో ఫోన్ ఉంటే చాలా సంప‌న్నకుటుంబంగాప‌రిగ‌ణించేవారు.క‌రెంటు లేని గ్రామాలు క‌నిపించేవి, టీవీ చూడాలంటే దూర‌ద‌ర్శ‌న్ మాత్ర‌మే ఉండేది.. ఊరికి ఒక‌రు లేదా ఇద్ద‌రి ఇంట్లోనే టీవీలు ఉండేవి. ఈ విష‌యాల‌న్నీ ఎందుకు చెప్ప‌వ‌ల‌సి వస్తుందో తెలుసా? ఏ ప్రాంత ప్ర‌జ‌ల‌యినా మొన్న‌టి కంటే నిన్న.. నిన్న‌టి క‌న్నా నేడు బాగుండాల‌ని కోరుకుంటారు. అలాగే పురోగ‌తి చెందుతూ వ‌చ్చింది. అన్ని ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి జ‌ర‌గాలి, అంత‌కు ముందు సాధించిన ప్ర‌గ‌తి కంటే మ‌రింత ప్ర‌గ‌తి సాధించాలి.. కానీ, మన రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి చెందే అవకాశాలు తగ్గిపోతున్నాయి’ అనిజగన్వ్యాఖ్యానించారు.
     హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు న‌గ‌రాలు ఎంతో అభివృద్ధి చెందాయ‌ని జ‌గ‌న్ అన్నారు. హైద‌రాబాద్‌లో ఎన్నో ప్రైవేటు, ప్ర‌భుత్వ క‌ర్మాగారాలు ఉన్నాయ‌ని చెప్పారు. ‘యువత కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఎన్నో సంస్థ‌లు, ఫ్యాక్ట‌రీలు హైద‌రాబాద్‌లో క‌నిపిస్తున్నాయి. ప్ర‌భుత్వాలు అందించిన తోడ్పాటుతో అభివృద్ధిలో ఆ న‌గ‌రాలు దూసుకుపోతున్నాయి. అయితే, ఏపీలో అలాంటి సంస్థ‌లు రావాలంటే ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి సాయం అంద‌డం లేదు' అని ఆయ‌నఆరోపించారు.ఇన్నాళ్లు సుస్థిరంగా సాగుతూ వ‌స్తోన్న అభివృద్ధి చంద్ర‌బాబు నాయుడి పాల‌నతో మ‌రింత ముందుకు వెళ్లే ప‌రిస్థితులు క‌న‌ప‌డ‌డం లేదు. రాష్ట్రాభివృద్ధి జ‌ర‌గాలంటే ప్ర‌త్యేక హోదా లేనిదే సాధ్యం కాదు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఏపీలోని యువ‌త ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాల‌కు వెళ్లే అవ‌స‌రం ఉండ‌బోదు’ అని జగన్ వ్యాఖ్యానించారు.

 

(1431)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ