'లోకేష్‌' ఆంధ్రా 'శశికళ' అట....! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోకేష్‌' ఆంధ్రా 'శశికళ' అట....!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి 'నారా లోకేష్‌' ఆంధ్రా 'శశికళ' అట. 'లోకేష్‌' తండ్రి నారా చంద్రబాబునాయుడు 'జయలలిత' అట...! వీరిద్దరూ కలసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారట. 'చంద్రబాబు'కు నైతికత ఉంటే వైకాపా నుండి టిడిపిలో చేరిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలట. వైకాపాకు చెందిన 'వెల్లంపల్లి శ్రీనివాస్‌' ఈ రోజు విలేకరుల సమావేశంలో పై వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు..రెండు ఎకరాల ఆసామి వేల కోట్ల ఆస్తి ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఓటుకు నోటు కేసులో పబ్లిక్‌గా దొరికిన 'చంద్రబాబు'కు 'జగన్‌'ను విమర్శించే అర్హత లేదట. ఆ కేసుకు భయపడే రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని నిలదీయడంలేదని ఆయన విమర్శించారు. 'యువభేరి' సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం 'చంద్రబాబు'కు లేదని, ఎపిని అవినీతి రాష్ట్రాంగా మార్చారని ఆయన ఆరోపించారు.


(794)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ