WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రోడ్డు ప్ర‌మాదంలో జేఎన్టీయూ వీసీ మృతి

అనంతపురం జిల్లాలో బుదవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో  జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ తో పాటు మరో  ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న లారీని వీసీ కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అనంతపురం జేఎన్టీయూ వీసీ సర్కార్, ఆయన పీఏ ఫక్రుద్దీన్, డ్రైవర్ ప్రసాద్ మృతి చెందారు. ఎదురెదురుగావస్తున్నలారీని జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.వైస్ చాన్స్‌లర్ ఎంఎంఎం సర్కార్ మృతిపట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ‌ సానూభూతిని తెలిపారు. స‌ర్కార్ మృతి బాధాక‌రమని, విద్యారంగానికి స‌ర్కార్ చేసిన సేవ‌లు మ‌రువ‌లేనివని అన్నారు. దీంతో జేఎన్టీయూలో విషాదం నెలకొంది.

(342)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ