లేటెస్ట్

టిడిపి సన్నిహిత ఐఎఎస్‌లకు నో పోస్టింగ్‌...!

టిడిపి ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో పనిచేసిన చాలా మంది ఐఎఎస్‌ అధికారులకు ఈసారి పోస్టింగ్‌లు దక్కలేదు. సిఎంఒలో కీలకంగా పనిచేసిన 'సతీష్‌చంద్ర, సాయిప్రసాద్‌, రాజమౌళి'లకు పోస్టింగ్‌ దక్కలేదు. అదే విధంగా జలవనరులశాఖ కార్యదర్శిగా పనిచేసిన 'శశిభూషణ్‌కుమార్‌',బిసి వెల్ఫేర్‌శాఖ కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, ఎనర్జీశాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌, ఎపి జెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.విజయానంద్‌, సివిల్‌ సప్లయి కార్యదర్శి వరప్రసాద్‌, మున్సిపల్‌శాఖ కమీషనర్‌ కె.కన్నబాబు, పంచాయితీరాజ్‌ ఎండి రజిత్‌భాషా, సిఆర్‌డిఎ కమీషనర్‌ సి.శ్రీధర్‌, సిఆర్‌డిఎ అడిషనల్‌ కమీషనర్‌ సాగలి షాహన్‌ మోహన్‌, తూర్పుగోదావరి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తదితరులకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. టిడిపి ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరపారన్న నెపంతో వీరికి పోస్టింగ్‌ ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా..వీరిలో కొందరిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాగా..టిడిపి ప్రభుత్వ హయాంలో వైకాపాతో ఘర్షణ వైఖరి అవలంభించారని కొందరు అధికారులకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. కాగా..'చంద్రబాబు' కార్యాలయంలో పనిచేసిన 'గిరిజాశంకర్‌'కు కీలకమైన పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి పదవి లభించడం విశేషం. 'గిరిజాశంకర్‌' ఎన్నికల ఫలితాలు రాక ముందే 'జగన్‌'ను కలసి అభినందించారని వార్తలు వచ్చాయి. 'చంద్రబాబు' కార్యాలయంలో పనిచేస్తూనే ఆయన 'జగన్‌' గెలుస్తారనే అభిప్రాయంతో ముందునుంచి వైకాపాకు దగ్గరయ్యారని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే సిఎంఒలో పనిచేసిన మిగతా అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకపోయినా...'గిరిజాశంకర్‌'కు ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్‌ ఇచ్చారనే అభిప్రాయం వారిలో ఉంది. 

(332)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ