WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్లైఓర్ నుంచి కింద‌ప‌డ్డ బ‌స్సు : 8 మంది మృతి...!

పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడింది. దీంతో అక్కడికక్కడే ఎనిమిది ప్రయాణికులు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. మరికొంతమంది సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న మరో 10 మందిని గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరి పేర్లుః భువనేశ్వర్‌, శ్రీకాకుళం. వీరు విశాఖ వాసులుగా గుర్తించారు. ప్రమాదస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు‌ నెంబరు: ఏపీ 02 టీసీ 7146. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.


(215)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ