WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వై.ఎస్‌'ను 'జగన్‌' చంపించాడు....!

దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని ఆయన తనయుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డే హత్య చేయించారని టిడిపి ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. జె.సి.ప్రభాకర్‌రెడ్డి చేసిన ఈ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి కోసం వై.ఎస్‌.జగన్‌ స్వంత తండ్రినే చంపించారని ఆయన ఈ రోజు ఆరోపించారు. తాడిపత్రిలోని 'సాక్షి' దినపత్రిక కార్యాలయం ఎదుట ధర్నా చేసిన జె.సి.ప్రభాకర్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి కోసం వై.ఎస్‌.జగన్‌ చివరకు స్వంత తండ్రి అని కూడా చూడకుండా హత్య చేయించారని ఆరోపించారు. కృష్ణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో సిఎం చంద్రబాబు తమను ఏ విధంగా కాపాడుతున్నాడో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సిఎం పదవి కోసం వై.ఎస్‌.జగన్‌ పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 'సాక్షి' కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న జె.సి.ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 

   మరో వైపు ఎంపి జె.సి.దివాకర్‌రెడ్డి కూడా వై.ఎస్‌.జగన్‌పై విమర్శలు కురిపించారు. మానవ తప్పిదం వల్ల ప్రమాదానికి తమను బాధ్యులు చేయడం, కలెక్టర్‌ కాలర్‌ పట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రమాదంలో మృతులు మాంసపు ముద్దులుగా మారిపోయారని అటువంటి సమయంలో హాస్పటల్‌కు వెళ్లిన ప్రతిపక్షనాయకుడు వ్యవహరించిన తీరు సరికాదని ఆయన అన్నారు. కాగా తమను టార్గెట్‌ చేసిన వై.ఎస్‌.జగన్‌పై జెసి సోదరులు ఎదురుదాడి  చేస్తున్నారు. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదం జరిగిన తరువాత వై.ఎస్‌.జగన్‌ జెసి సోదరులపై దాడి చేస్తే...దీనికి ప్రతిగా ఈ రోజు జె.సి.ప్రభాకర్‌రెడ్డి 'సాక్షి' కార్యాలయం ముందు ధర్నాకు కూర్చున్నారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి వీరు ప్రయత్నిస్తుండడంతో 'అనంతపురం' జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.


(412)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ