WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అమెరికాలో మ‌రో జాత్య‌హంకార హ‌త్య‌...!

జాత్య‌హంకార దాడిలో మ‌ర‌ణించిన  తెలుగు యువకుడు శ్రీనివాస్‌ మరణించిన ఘటన నుంచి తేరుకోకముందే మరో సంఘటన జరిగింది. సౌత్‌ కరోలినాలో గురువారం రాత్రి భారత సంతతికి చెందిన ఓ వ్యాపారిని ఆయన ఇంటి ముందే హత్య జ‌రిగింది. లాంకాస్టర్‌ ప్రాంతంలో హర్నీష్‌ పటేల్‌ అనే వ్యక్తి గురువారం రాత్రి 11.24 సమయంలో దుకాణం మూసేసి ఇంటికి వెళ్తుండగా.. పది నిమిషాలకే ఇంటికి సమీపంలోనే కాల్చి చంపారు. ఇటీవల కేన్సస్‌లో అమెరికన్‌ వ్యక్తి బార్‌లో కాల్పులు జరపగా శ్రీనివాస్‌ కూచిభొట్ల మరణించగా, అలోక్‌, మరో అమెరికన్‌ వ్యక్తి గ్రిల్లాట్‌ గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించిన రెండ్రోజుల్లోనే మరో భారతీయుడు హత్యకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది.పటేల్‌ మృతిపై దర్యాప్తు చేస్తున్నామని లాంకాస్టర్‌ అధికారులు వెల్లడించారు. దర్యాప్తు జరుగుతుండగా ఇది జాత్యహంకార దాడి అని చెప్పలేమని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.నిందితుల కోసం గాలిస్తున్నారు. గురువారం రాత్రి ఓ మహిళ పోలీసులకు ఫోన్‌ చేసి వ్యక్తి అరుపులు, తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని చెప్పడంతో వారు ఘటనాస్థలానికి వచ్చారు. పటేల్‌ ఇంటికి కొంచెం దూరంలోనే ఆయన మృతదేహం పోలీసులకు లభ్యమైనట్లు  టీవీ వెల్లడించింది. పటేల్‌ చాలా మంచి వ్యక్తి అని, కస్టమర్లతో చాలా మర్యాదగా వ్యవహరిస్తారని, చాలా దయగల వ్యక్తి అని అక్కడి వారు చెప్పారు. పటేల్‌కు భార్య, ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుతున్న చిన్నారి ఉన్నారు. 

(426)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ