WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోకేష్‌'కు మంత్రి పదవి ఇవ్వాలి:అన్నం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌నాయుడు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, వెంటనే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. తాను ఇటీవల కాలంలో పలుసార్లు స్వయంగా కలసి విన్నవించానని 'సతీష్‌' చెప్పారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలకు ప్రోత్సహించి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించి, ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంలో 'చినబాబు' పాత్ర ఎంతో ఉందని తాను జీవితాంతం ఆయన పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తానని 'అన్నం' చెప్పారు. బాపట్ల పట్టణంలోని వీధి వ్యాపారస్తులకు గొడుగులు పంపిణీ చేశారు. వేసవి కాలంలో చిరువ్యాపారులకు ఎండవేడిమికి గురి కాకుండా గొడుగులను అందించారు. గొడుగులపై తెలుగుదేశం పార్టీ నినాదాలు రాయించారు. నియోజకవర్గ అభివృద్ధిలో 'చినబాబు' తనకు అండదండగా నిలుస్తున్నారని అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని 'అన్నం' చెప్పారు. 

   చిన్న చిన్న సంఘటనలను బూతద్దంలో చూపిస్తూ లేనిపోని విషయాలను అంటగడుతున్నారని ఈ విషయంలో మీడియా తనను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. చిన్నపాటి సంఘటనలు ఇటీవల కాలంలో జరిగాయని, మళ్లీ అటువంటి సంఘటనలను జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానని, ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెలిపానని 'సతీష్‌' తెలిపారు. వయసులో చిన్నవాడిని అయినా తనను రాజకీయంగా ప్రోత్సహిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి ఉదారంగా నిధులను 'చంద్రబాబు' కేటాయిస్తున్నారని, బొందిలో ప్రాణం ఉన్నంత వరకు పెదబాబుకు,చినబాబుకు విధేయంగా ఉంటానని నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎటువంటి అవినీతిని సహించనని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని, ఎక్కడైనా, ఏదైనా అవకతవకలు జరిగితే తన దృష్టికి తేవాలని గ్రామస్థాయి నాయకులకు చెప్పానని ఆయన తెలిపారు.




(507)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ