లేటెస్ట్

విద్యుత్‌ 'పీపీఎల'పై సమీక్షలు వద్దు...!

నూతన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దూకుడుకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. గత ప్రభుత్వం విద్యుత్‌ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై సమీక్ష చేస్తామని, దానిలో అవినీతి జరిగిందని..వీటిని రద్దు చేస్తామని, చంద్రబాబు అవినీతిని బయటపెడతామని...'జగన్‌' ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర నూతన పునరుద్పాతన విద్యుత్‌శాఖ కార్యదర్శి 'ఆనంద్‌కుమార్‌' రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'ఎల్‌.వి.సుబ్రహ్మణ్యానికి ఒక లేఖ రాస్తూ.. ఏపీలో రెన్యువబుల్‌ ఎనర్జీ కంపెనీలువిద్యుత్‌ చట్టంలోని 62,63 సెక్షన్‌ ప్రకారం ఒప్పందాలు చేసుకున్నాయరని, రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణా సంస్థలు, సీఈఆర్‌సీ మార్గదర్శకాల ప్రకారం వాటి రేట్లను నిర్ధారించారని, బహిరంగ పోటీ బిడ్డింగ్‌ల ద్వారా టారిఫ్‌లను నిర్ణయించారని, అంతా చట్ట ప్రకారమే జరిగిందని, దీనిపై సమీక్షలు చేస్తే...పెట్టుబడిదారులకు విశ్వాసం సన్నగిల్లుతుందని...ఈ సమీక్షలు చేయవద్దని...ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి 'వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి'కి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యానికి తెలిపారు. 

గత టిడిపి ప్రభుత్వం సోలార్‌, విండ్‌ పవర్‌ ఉత్పత్తిదారులతో కుదుర్చుకున్న ఒప్పందాలు అవినీతి మయమని, ఇతర రాష్ట్రాల్లో యూనిట్‌కు రూ.2.50 ఉంటే మన రాష్ట్రంలో రూ.4.80 ఉందని, పీక్‌ అవర్స్‌లో ఇది రూ.6/- కొనుగోలు చేస్తున్నారని, ఇదంతా 'చంద్రబాబు' తనకు కావాల్సిన వారికి దోచి పెట్టడానికేనని 'జగన్‌' ఆరోపించారు. దీనిపై తాను సమీక్ష నిర్వహిస్తానని, దీనిలో ఉన్న అవినీతిని బయటపెడతానని..ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. కాగా...ఈ ఒప్పందాలపై సమీక్షలు నిర్వహిస్తారనే వార్తలు రావడంతోనే కేంద్ర పునరుద్పాతన విద్యుత్‌శాఖ స్పందించింది. దీనిపై...ఎటువంటి సమీక్షలు చేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో..టిడిపి నాయకులు..తాము..నిజాయితీగానే వ్యవహరించామని చెప్పుకుంటున్నారు. తాము అవినీతికి పాల్పడలేదని, 'జగన్‌' కావాలని తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా...పీపీఎల సమీక్షలపై కేంద్రం జోక్యం చేసుకోవడంపై...వైకాపా నేతలు మరో రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. 'చంద్రబాబు'కు చెందిన కంపెనీలు కేంద్రంపై ఒత్తిడి చేశాయని, అందుకే వాటిపై సమీక్షలు వద్దని అక్కడ నుంచి ఆదేశాలు వచ్చాయని ఆరోపిస్తున్నారు. 

(178)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ