లేటెస్ట్

సమాచార‌శాఖ‌ మంత్రిగా....అప్పుడు తండ్రి...ఇప్పుడు కుమారుడు...!

రాష్ట్రంలో ఏర్పడిన నూతన మంత్రివర్గం గతాన్ని గుర్తుకు తెస్తోంది. గతంలో వై.ఎస్‌. మహిళను హోంమంత్రిగా నియమిస్తే...'జగన్‌' కూడా మహిళనే హోం మంత్రిగా నియమించారు. అదే విధంగా..గతంలో తండ్రి సమాచారశాఖను నిర్వహిస్తే...ఇప్పుడు..ఆయన కుమారుడు కూడా సమాచారశాఖను నిర్వహించబోతున్నారు. తాజాగా ఏర్పడిన నూతన మంత్రివర్గంలో మచిలీపట్నం నుంచి గెలుపొందిన 'పేర్ని నాని'కి మంత్రి పదవి దక్కింది. ఆయన రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల మంత్రిగా పనిచేయబోతున్నారు. గతంలో ఆయన తండ్రి పేర్ని కృష్ణమూర్తి కూడా సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో తండ్రి నిర్వహించిన శాఖను...మళ్లీ కుమారుడు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఇదే మొదటి సారేమో...? తండ్రి నిర్వహించిన శాఖకే మళ్లీ కుమారుడు మంత్రి అవడంపై...రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 'పేర్ని కృష్ణమూర్తి'..సమాచారశాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో జర్నలిస్టులకు కావల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసి...జర్నలిస్టులకు మిత్రుడుగా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం..ఆయన కుమారుడు కూడా..అదే విధంగా వ్యవహరిస్తారని...జర్నలిస్టులు ఆశిస్తున్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన గృహాలు, హెల్త్‌స్కీమ్‌, వేతన సవరణ, జర్నలిస్టులపై దాడుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు..జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాల్సి ఉంది. తండ్రి వలే...కుమారుడు కూడా...మంచి పేరు తెచ్చుకుంటారని..పలువురు జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు.

(411)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ