WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రోజాను చూస్తే టిడిపి నాయ‌కులు ప్యాంట్లు త‌డుపుకుంటున్నార‌ట‌...!

 వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాను మ‌రో సంవ‌త్స‌రం పాటు ఆమెను స‌స్పెండ్ చేస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంపై స్పందించిన సీపీఐ నారాయ‌ణ త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటించారు.ఏపీ శాసనసభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజాను చూసి టీడీపీ నేతలు వణికి పోతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారమిక్కడ మాట్లాడుతూ... కాళిమాతను  చూసినట్లుగా రోజాను చూసి వణికిపోతున్నారన్నారు. ఏపిలోటీడీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌‑లు ప్రతిపక్షాలను చూసి ప్యాంటులు తడుపుకుంటున్నారని వ్యాఖ్యనించారు.. అగ్రిగోల్డ్‌ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...అమెరికాలో భారతీయులపై దాడులను పట్టించుకోవడం లేదని నారాయణ విమర్శించారు. మన దేశంలో కూడా మత విద్వేషాలు కొనసాగడం విచారకరమని ఆయన అన్నారు. 

  అసెంబ్లీలో ఇలా సస్పెండ్‌ చేసుకుంటూ వెళితే ఎవరు మిగలరని నారాయణ అన్నారుఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను సంవ‌త్స‌రం పాటు స‌స్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ కాలం ముగుస్తుండ‌డం, మ‌రోవైపు రోజా క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోవ‌డంతో అసెంబ్లీలో టీడీపీ స‌భ్యులు రోజాను చూసి కాళీమాత‌ను చూసిన‌ట్లు వ‌ణికిపోతున్నార‌ని అన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలూ ప్ర‌తిప‌క్షాల‌ను చూసి భ‌య‌ప‌డుతున్నాయ‌ని అన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఆయన స్పందిస్తూ భారతీయ జనతా పార్టీ దొడ్డిదారిలో గెలిచిందని ఆరోపించారు.

(454)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ