WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రూ.2వేల నోటును ర‌ద్దు చేయం...!

ఆర్బీఐ కొత్త‌గా ముద్రించిన రెండు వేల రూపాయ‌ల నోట్ల‌ను ఉప‌సంహ‌రించే ప్ర‌తిపాద‌న లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్ప‌ష్టం చేశారు. శుక్రవారం  ఆయ‌న లోక్‌స‌భ‌లో ఇచ్చిన లిఖిత పూర్వ‌క స‌మాధానంలో ఈ అంశాన్ని వెల్ల‌డించారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్ 8వ తేదీన రూ.500, వెయ్యి పాత పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ఆర్బీఐ కొత్త రెండు వేల నోట్ల‌ను ముద్రించింది. రూ.2వేల నోట్ల‌తో పాటు కొత్త‌గా రూ.500 నోట్ల‌ను కూడా ముద్రించారు. నోట్ల ర‌ద్దు త‌ర్వాత సుమారు 12.44 ల‌క్ష‌ల కోట్ల పాత పెద్ద నోట్లు ఆర్బీఐ చెస్ట్‌లోకి వ‌చ్చిన‌ట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది మార్చి 3వ తేదీ వ‌ర‌కు సుమారు 12 ల‌క్ష‌ల కోట్ల క‌రెన్సీ చ‌లామ‌ణిలో ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు. జ‌న‌వ‌రి 27 వ‌ర‌కు సుమారు 9.921 ల‌క్ష‌ల కోట్లు చెల‌మ‌ణిలో ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. న‌ల్ల‌ధ‌నం, అవినీతి, న‌కిలీ నోట్ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ఉద్దేశంతోనే పాత పెద్ద నోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన‌ట్లు జైట్లీ చెప్పారు.పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం విధించిన‌ బ్యాంకు ఖాతాల్లో న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ ఆంక్ష‌లను క్ర‌మంగా తొల‌గించామ‌ని అన్నారు

(322)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ